ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE Flights: ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన పీసీఆర్ టెస్ట్ సెంటర్

ABN, First Publish Date - 2021-08-09T14:26:10+05:30

భారత ప్రయాణికులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. 45-60 నిమిషాల్లో ప్రయాణికులు తమ టెస్టు రిపోర్టును పొందొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో అమలులోకి వచ్చిన ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రయాణికులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. 45-60 నిమిషాల్లో ప్రయాణికులు తమ టెస్టు రిపోర్టును పొందొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో అమలులోకి వచ్చిన ప్రయాణ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన నివాసితులు ఆగస్టు 5 నుంచి తిరిగి యూఏఈకి రావొచ్చని ప్రకటించింది. ప్రయాణికులు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా పొంది ఉండాలని తెలిపింది. అంతేకాకుండా బోర్డింగ్‌కు ముందు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.



ఈ క్రమంలో ఈ నెల 5 నుంచి న్యూఢిల్లీ, చెన్నై, కొచ్చి, బెంగళూరు తదితర నగరాల నుంచి యూఏఈకి విమాన సర్వీసలు ప్రారంభమయ్యాయి. కాగా.. బోర్డింగ్ సమయానికి ముందు ప్రయాణికులు ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు డాక్టర్ గౌరీ అగర్వాల్ వెల్లడించారు. ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్‌కు రూ.5వేలు ఛార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. టెస్ట్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను 45-60నిమిషాల్లో ప్రయాణికులు పొందొచ్చని పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-09T14:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising