ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌తీయుడికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన.. లండ‌న్ మేయ‌ర్‌

ABN, First Publish Date - 2021-05-14T16:51:20+05:30

గ‌త వారం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచి వ‌రుస‌గా రెండోసారి లండ‌న్ మేయ‌ర్‌గా ఎన్నికైన సాదిక్ ఖాన్‌.. భార‌త సంత‌తి వ్య‌క్తి, పారిశ్రామిక వేత్త రాజేష్ అగ‌ర్వాల్‌కు తాజాగా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండ‌న్: గ‌త వారం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో గెలిచి వ‌రుస‌గా రెండోసారి లండ‌న్ మేయ‌ర్‌గా ఎన్నికైన సాదిక్ ఖాన్‌.. భార‌త సంత‌తి వ్య‌క్తి, పారిశ్రామిక వేత్త రాజేష్ అగ‌ర్వాల్‌కు తాజాగా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రాజేష్‌ను డిప్యూటీ మేయ‌ర్ ఫ‌ర్ బిజినెస్‌గా ఎంపిక చేశారు. కాగా, రాజేష్ ఈ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఇది వ‌రుస‌గా రెండోసారి. ఇక త‌న‌కు ఈ ప‌ద‌వి ద‌క్క‌డం ప‌ట్ల రాజేష్ ఆనందం వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణ‌మైన లండ‌న్ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. గ‌డిచిన ఐదేళ్లు ఇదే ప‌దవిలో లండ‌న్ వాసుల‌కు తాను చేసిన సేవ‌ల‌ను ఈ సంద‌ర్భంగా రాజేష్ గుర్తు చేసుకున్నారు. మ‌హ‌మ్మారి క‌ల్లోలం వేళ త‌లెత్తిన ఆరోగ్య‌, ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను తాము అధిగ‌మించిన తీరు అమోఘం అని పేర్కొన్నారు. త‌న‌పై న‌మ్మ‌కంతో రెండోసారి ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాజేష్ స్వ‌స్థ‌లం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్. 

Updated Date - 2021-05-14T16:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising