ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రావెల్ రూల్స్‌ను అప్‌డేట్ చేసిన ఖతర్.. భారత ప్రయాణికులకూ వర్తిస్తాయి

ABN, First Publish Date - 2021-08-02T14:12:05+05:30

రోనా విజృంభణ నేపథ్యంలో ఖతర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు ఆసియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ట్రావెల్ పాలసీని అప్‌డేట్ చేసింది. అప్‌డేట్ చేసిన ఈ ట్రావెల్ పాలసీ నేటి (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఈ ట్రావెల్ పాలసీ ప్రకారం.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రయా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ఖతర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు ఆసియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ట్రావెల్ పాలసీని అప్‌డేట్ చేసింది. అప్‌డేట్ చేసిన ఈ ట్రావెల్ పాలసీ నేటి (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఈ ట్రావెల్ పాలసీ ప్రకారం.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రయాణికులు రెండు రోజులపాటు హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కొవిడ్ బారి నుంచి బయటపడిన వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. వ్యాక్సిన్ తీసుకోనటువంటి ప్రయాణికులు మాత్రం 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాల్సిందే అని ఖతర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పీసీఆర్ టెస్ట్‌లో కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ పొందిన ప్రయాణికులు క్వారెంటైన్‌ను వీడొచ్చని తెలిపింది. ఈ నిబంధనలు భారత్‌తోపాటు నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా వర్తిస్తాయని ఖతర్ వెల్లడించింది. కాగా.. ఖతర్‌లో ఇప్పటి వరకు 2.7 మిలియన్ల మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 


Updated Date - 2021-08-02T14:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising