ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విడాకులయ్యాక దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నారై ‘భార్య’.. ఆ ఫోన్‌ కాల్‌తో మాజీ భర్తకు మైండ్ బ్లాంక్..!

ABN, First Publish Date - 2021-11-18T23:34:50+05:30

కెనడాలో నివసించే ఓ ఎన్నారై మహిళతో 2013లో పెళ్లి.. 2018లో విడాకులు.. పరస్పర అంగీకారంతోనే ఆ జంట విడిపోయింది. ఇక ఎవరి దారి వారిదేనని అకున్నాడా వ్యక్తి. కానీ ఆ మరుసటి ఏడాదే..ఊహించని ఘటన జరిగింది!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్:  కెనడాలో నివసించే మహిళతో అతడికి 2013లో పెళ్లి..  2018లో విడాకులు.. పరస్పర అంగీకారంతోనే ఆ జంట విడిపోయింది. ఇక ఎవరి దారి వారిదేనని అనుకున్నాడా వ్యక్తి. కానీ ఆ మరుసటి ఏడాదే..ఊహించని ఘటన జరిగింది! వరకట్న వేధింపుల నేరం కింద కేసు నమోదు చేశామంటూ పోలీసులు అతడికి కబురంపారు. అయితే.. విదేశాల్లో ఉంటూనే తన మాజీ భార్య ఫోన్ కాల్‌తో ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని తెలిసి అతడు షాకైపోయాడు. చివరికి పంజాబ్ హరియాణా హైకోర్టును ఆశ్రయించాడు. 


కెనడాలోని న్యాయస్థానం తమకు విడాకులు మంజూరు చేసిందని, ఆ సమయంలో కోర్టు నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించానని అతడు చెప్పుకొచ్చాడు. అప్పట్లో తాము పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలిపాడు. కేవలం తనను, తన తల్లిదండ్రులను వేధించేందుకే ఈ కేసు పెట్టిందని చెప్పాడు. ఫిర్యాదులో కూడా ఆమె తన భార్య అని పేర్కొన్న అంశాన్ని కూడా ప్రస్తావించాడు. విడాకుల తరువాత కూడా ఇలా పేర్కొనడం ఆమె దుర్బుద్ధిని సూచిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ వాదనను పరిగణలోకి తీసుకుని తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోర్టుకు నివేదించాడు. 


కాగా..న్యాయస్థానం కూడా అతడి వాదనలతో ఏకీభవించింది.  ‘‘ఫిర్యాదు సందర్భంగా ఆమె తనని తాను వరీందర్ భార్యగా పేర్కొనడం నిజమేనని తెలియిపోయింది కాబట్టి.. వరీందర్ వాదనలకు బలం చేకూరినట్టైంది. అటార్నీ ద్వారా కేసు ఫైల్ చేసేందుకు అమెకున్న ప్రత్యేకాధికారాలను వినియోగిస్తూ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించిందని అనిపిస్తోంది’’ అంటూ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా.. స్థానిక పోలీసులపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఏకంగా క్రిమినల్ కేసులనే ఇలా యాంత్రికంగా నమోదు చేయడం ఏంటని వ్యాఖ్యానించారు. ప్రాథమిక స్థాయిలో దర్యాప్తు చేపట్టకుండానే పోలీసులు ఎన్నారైల విడాకుల కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-18T23:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising