ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. హెచ్‌-1బీ వీసాలు మరింత భారం!

ABN, First Publish Date - 2021-11-03T01:05:15+05:30

ప్రతిపాదిత బడ్జెట్ రీకన్సీలియేషన్ బిల్లుకు అమెరికాలో ఆమోదం లభిస్తే భారతీయులకు అమెరికా వీసా దరఖాస్తు ఖర్చులు మరింత భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముసాయిదా బిల్లులో.. హెచ్-1బీ వీసా పిటిషన్‌లపై 500 డాలర్ల అదనపు చార్జీ విధించాలనే ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిపాదిత బడ్జెట్ రీకన్సీలియేషన్ బిల్లుకు అమెరికాలో ఆమోదం లభిస్తే భారతీయులకు అమెరికా వీసా దరఖాస్తు ఖర్చులు మరింత భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముసాయిదా బిల్లులో.. హెచ్-1బీ వీసా పిటిషన్‌లపై  500 డాలర్ల అదనపు చార్జీ విధించాలనే ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా.. అమెరికాకు శాశ్వతంగా వలసవెళ్లేందుకు అవకాశం కల్పించే ఇతర వీసాల విషయంలోనూ అదనపు చార్జీల ప్రతిపాదన ఉంది.


ముఖ్యంగా.. సంస్థ స్పాన్సర్ చేసే పర్మెనెంట్ వీసాకు 800 డాలర్లు, ఎఫ్-1(స్టూడెంట్) వీసా కోసం 250 డాలర్లు అదనంగా వసూలు చేయాలని ఈ బిల్లులో ఉంది. ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన అమెరికాలో ఉంటున్న విదేశీయుల భాగస్వాములకు భారంగా మారే ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. ఇటువంటి వారు  అమెరికాలో పని చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంటే అదనంగా 500 డాలర్లు చెల్లించాలి. విద్యార్థులు.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్‌కు దరఖాస్తు చేసుకున్నా, లేదా తమ వీసా స్టేటస్‌కు మార్పులు చేర్పులు చేయాలన్నా ఈ బాదుడు తప్పదు. 


హెచ్-1బీ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే సంక్లిష్టంగా మారిందని, ఈ ప్రతిపాదనలు యథాతథంగా అమల్లోకి వస్తే మరిన్ని సమస్యలు తప్పవని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ ఎస్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఇకపై హెచ్-1బీకి దరఖాస్తు చేసుకున్నా లేదా వీసా కాలం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నా 30 వేల డాలర్ల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసేందుకు ప్రాథమికంగా 450 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి లాయర్ చార్జీలు, యాంటీ ఫ్రాడ్, స్కాలర్‌షిప్ ఫీజులు వంటివి అదనం.


హెచ్-1బీ వీసాపై అనేక మంది ఉద్యోగులను అమెరికాకు పంపించిన సంస్థలు ప్రతి దరఖాస్తుకు అదనంగా 4000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు కింది 2500 డాలర్లు కూడా ఇచ్చుకోవాలి. అమెరికాలో ఇప్పటికే ఐటీ ఉద్యోగుల కొరత ఉందని, ఈ నిబంధనలు సమస్యను మరింత తీవ్రం చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Updated Date - 2021-11-03T01:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising