ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: తల్లిపై దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ 9 ఏళ్ల చిన్నారి ఎవ్వరూ ఊహించని విధంగా..

ABN, First Publish Date - 2021-11-21T22:18:37+05:30

తల్లిని కాపాడిన చిన్నారిపై ప్రశంసల జల్లు ..అసలేం జరిగిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎదురుగా దుండగుడు.. తన తల్లిని కిందకు తోసేసి ఆమె డబ్బును దోచుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ఇదంతా చూసింది. వెంటనే.. తల్లిని రక్షించేందుకు ఆ దొంగపైనే దాడి చేసింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. ఈ దెబ్బతో దొంగ కంగారు పడిపోయాడు. చేతికి అందిన వాటితో అక్కడి నుంచి ఉడాయించాడు. తల్లి కోసం ఇంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆమె వయసు కేవలం 9 ఏళ్లు. మరొకరు ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేయాలో పాలుపోక గుక్కపెట్టి ఏడ్చేవారు. కానీ.. ఆ చిన్నారి మాత్రం ఎవ్వరూ ఊహించని చిచ్చరపిడుగులా చెలరేగికి ముష్కరుడికి చుక్కలు చూపించింది. ఆ చిన్నారి చిరుత పేరు.. జర్నీ నెల్సన్. ఆమె స్వస్థలం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం.


గతనెలలో మియామీలోని పామ్ బీచ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. జర్నీ తల్లి తాను షాపింగ్‌లో కొనుక్కున్న వస్తువులను కారులో సర్దుతుండగా.. దుండగుడు వెనకు నుంచి వచ్చి ఆమెను కిందకు తోసేశాడు. ఆ తరువాత.. ఆమె వద్ద ఉన్న డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. గమనించిన జర్నీ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దొంగపై దాడి చేసింది. ఎటువంటి బెరుకూ లేకుండా అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తోంది. గొడవ పెద్దదవుతుండటంతో..ఎవరైనా వస్తారేమో అని భయపడిపోయిన ముష్కరుడు చేతికి అందిన వస్తువులతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే.. జర్నీ అతడిని మరికొంత దూరం పాటు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు పోలీసులు నిందితుడు డెమిట్రీయస్ జాక్సన్‌ను అరెస్టు చేశారు. అయితే.. ఇంతటి ప్రమాదంలోనూ ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఆమెను పోలీసులు ఇటీవల ఓ జ్ఞాపికతో సత్కరించారు. 



Updated Date - 2021-11-21T22:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising