ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ దుస్తులు మార్చుకుంటుండగా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు భారీ షాక్..!

ABN, First Publish Date - 2021-12-15T23:50:01+05:30

తాను దుస్తులు మార్చుకుంటుండగా ఇంట్లోకి ప్రవేశించారంటూ పోలీసులపై మహిళ ఫిర్యాదు.. చివరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అది 2019.. అమెరికాలోని ఇల్లినాయ్‌ రాష్ట్రంలోని చికాగో నగరం. ఓ క్రిమినల్ కోసం వెతుకుతున్న పోలీసులు  ఓ మహిళ ఇంట్లోకి తలుపులు తోసుకుంటూ బలవంతంగా ప్రవేశించారు. ఇంట్లోని మహిళ ఆ సమయంలో దుస్తులు మార్చుకుంటోంది.  అయితే.. పోలీసు ఆఫీసర్లు మాత్రం తాము వెతుకుతున్న అనుమానిత వ్యక్తి ఆమే అని నిర్ధారించుకుని మహిళ చేతులకు బేడీలు వేసి అలాగే నిలబెట్టారు. ఆ సమయంలో ఆమె ఒంటిపై దుస్తులు లేవు. ఇవేమీ పట్టించుకోని పోలీసులు తాము అనుకున్నది చేసేశారు. ఆ తరువాతే ఈ ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. సదరు మహిళను పోలీసులు గంటపాటు విచారించిన మీదట వారు వెతుకుతున్న వ్యక్తి ఆమె కాదని తేలింది. అసలు వారు వెతుకుతున్న క్రిమినల్ ఆమె పక్కింట్లోనే ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో.. బాధిత మహిళ ఖిన్నురాలైంది. తనకు ఘోర అవమానం జరిగినందుకు కుమిలిపోయింది. 


చివరికి..  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె కోర్టును ఆశ్రయించింది. పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన ఆమె.. తనకు న్యాయం చేయాలని కోర్టును వేడుకుంది. తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన 12 మంది పోలీసులను తన కేసులో నిందితులుగా చేర్చింది. కాగా.. ఇరు వర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం పోలీసులదే తప్పని స్పష్టం చేసింది. బాధితురాలిని అవమానించి, మానసిక క్షోభకు గురి చేసినందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ 2.9 మిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా ఆమెకు చెల్లించాలని తాజాగా తీర్పు వెలువరించింది. తమకు ఇన్ఫార్మర్ల ద్వారా అందిన సమాచారం నిజమోకాదో తేల్చుకోవాల్సిన  బాధ్యత పోలీసులదేనని ఈ సందర్భంగా న్యాయస్థానం తేల్చి చెప్పింది.  

Updated Date - 2021-12-15T23:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising