ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. భారత ప్రయాణికులపై పోలాండ్ కీలక నిర్ణయం!

ABN, First Publish Date - 2021-05-05T22:30:14+05:30

భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఇతర ఏ దేశంలో లేని మాదిరిగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో చాలా దేశాలు భార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఇతర ఏ దేశంలో లేని మాదిరిగా ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో చాలా దేశాలు భారత్‌ నుంచి రాకపోకలను నిలిపివేశాయి. తాజాగా పోలాండ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులకు క్వారెంటైన్ నిబంధనను తప్పనిసరి చేసింది. పోలాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భారత వేరియంట్‌కు సంబంధించిన కేసులు తమ దేశంలో నమోదైనట్టు తెలిపారు. ఇటీవల భారత్‌లో పర్యటించిన పోలాండ్ దౌద్యవేత్త కుటుంబం కూడా కరోనా బారినపడ్డారని చెప్పారు. ఈ క్రమంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారెంటైన్‌లో ఉండాలనే నిబంధనను తీసుకొచ్చినట్టు చెప్పారు. బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాల ప్రయాణికులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-05T22:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising