గగనతలంలోనే పేలిన విమానం ఇంజన్!
ABN, First Publish Date - 2021-02-22T14:14:43+05:30
అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం.. 231 మంది ప్ర యాణికులు, 10 మంది సిబ్బందితో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం హవాయ్‌కి బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే
- పైకెగిరిన కొద్ది సేపటికే విమానంలో మంటలు
బ్రూమ్‌ఫీల్డ్ (కొలరాడో), ఫిబ్రవరి 21: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం.. 231 మంది ప్ర యాణికులు, 10 మంది సిబ్బందితో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200 విమానం హవాయ్‌కి బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజన్ విఫలమైంది. ఇంజన్‌లో ఒక్కసారిగా మం టలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఏటీసీకి సమాచారమిచ్చి, ఇంజన్ శకలాలు భూమిపై పడుతుండగానే విమానాన్ని తిరిగి డెన్వర్ విమానాశ్రయం లో సురక్షితంగా దింపాడు. అప్పటి వరకు భయంతో వణికిపోయిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం హారర్ సినిమా ను తలపించిందని విమానంలోని ప్రయాణికులు, ప్రజ లు చెప్పారు. విమానం పైకెగిరిన కొద్దిసేపటికే కుడి వైపు రెక్కకు ఉన్న ఇంజన్‌లోంచి మంటలు చెలరేగాయ ని, విమానం నియంత్రణ కోల్పోవడం మొదలైందని ప్ర యాణికుడు డేవిడ్ డెలూసియా తెలిపారు. తాను, తన భార్య ప్రాణాలపై ఆశలు వదులుకున్నామన్నారు. ఇక ఇంజన్ శకలాలు ఒక్కోటిగా కింద పడ్డాయని, ఆకాశం లో నల్లటి పొగలు కమ్ముకున్నాయని బ్రూమ్‌ఫీల్డ్‌లోని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ శకలం ఇంటిపై పడిందని, ట్రక్కు కూడా ధ్వంసమైందని, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. ఇళ్లు, క్రీడా మైదానం, ఇతర ప్రాంతాల్లో పడిన భారీ శకలాల ఫొటోలను బ్రూమ్‌ఫీల్డ్ పోలీసులు ట్విటర్‌లో ఉంచారు.
Updated Date - 2021-02-22T14:14:43+05:30 IST