ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.9ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై యూఎస్ కాంగ్రెస్‌కు ప్రముఖుల లేఖ!

ABN, First Publish Date - 2021-02-25T05:50:23+05:30

అగ్రరాజ్య అధినేత జో బైడెన్ ప్రకటించిన 1.9ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీకి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా 150 సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మద్దతు తెలిపారు. ప్యాకేజీకి సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్య అధినేత జో బైడెన్ ప్రకటించిన 1.9ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీకి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా 150 సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మద్దతు తెలిపారు. ప్యాకేజీకి సంబంధించిన బిల్లును త్వరితగతిన ఆమోదించాలని కోరుతూ యూఎస్ కాంగ్రెస్‌కు బుధవారం లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాపై కొవిడ్-19 మహమ్మారి పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలపడిపోయింది. కోట్లాది మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్.. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు ఊతమిచ్చేలా, రాష్ట్రాలు కోలుకునే విధంగా, అమెరికా పౌరులను ఆర్థిక అవస్థల నుంచి బయటపడేసేందుకు 1.9ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు.


ఈ క్రమంలో అమెరికాలోని దాదాపు 150 సంస్థలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు తెలుపుతూ యూఎస్ కాంగ్రెస్‌కు లేఖ రాశారు. 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ బిల్లును యుద్ధ ప్రాతిపదికన ఆమోదించాలని లేఖలో కోరారు. యూఎస్ కాంగ్రెస్‌కు లేఖ రాసిన వారిలో గోల్డ్మన్ సాచ్స్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ సోల్మన్, బ్లాక్‌స్టోన్ చైర్మన్, సీఈఓ స్టీఫెన్ స్క్వార్ట్జ్‌మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-02-25T05:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising