ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America బ్లాక్‌లిస్టులో పెగాసస్‌.. నిషేధిత జాబితాలో ఎన్‌ఎస్ఓ

ABN, First Publish Date - 2021-11-04T12:58:51+05:30

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్‌ స్పైవేర్‌ను అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న నియంతృత్వ సర్కార్లు

అణచివేత కోసం సాంకేతికతను వాడుతున్నాయి

అమెరికా వాణిజ్య శాఖ వెల్లడి

అమెరికా బ్లాక్‌లిస్టులో పెగాసస్‌ 

నిషేధిత జాబితాలో ఎన్‌ఎస్ఓ.. ప్రకటించిన అమెరికా

వాషింగ్టన్‌, నవంబరు 3: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్‌ స్పైవేర్‌ను అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ స్పైవేర్‌ను  తయారు చేసిన ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎ్‌సఓను నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. పెగాసస్‌ వంటి టెక్నాలజీల ద్వారా నియంతృత్వ ప్రభుత్వాలు ఇతర దేశాలపై అణచివేత చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. నిరసన గళాన్ని వినిపించే జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పట్ల నిరంకుశ విధానాలను అమలుచేసేందుకు ప్రభుత్వాలు పెగాసస్‌ వంటి సాఫ్ట్‌వేర్లను ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయం పట్ల ఎన్‌ఎ్‌సఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము రూపొందించిన టెక్నాలజీలు అమెరికా జాతీయ భద్రతా విధానాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.


ఉగ్రవారం, ఇతర నేరాలను అరికట్టడానికి తమ టెక్నాలజీలు ఉపయోగపడతాయని తెలిపింది. కొన్ని ప్రభుత్వాలు తమ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేశాయని, అలాంటి ప్రభుత్వాలతో ఒప్పందాలను రద్దు చేసుకున్నామని ఎన్‌ఎ్‌సఓ పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన చండీరు, సింగపూర్‌కు చెందిన కంప్యూటర్‌ సెక్యూరిటీ ఇనీషియేటివ్‌ కన్సల్టెన్సీ, రష్యాకు చెందిన పాజిటివ్‌ టెక్నాలజీస్‌, జీరో క్లిక్‌ టెక్నాలజీలను కూడా అమెరికా బ్లాకులిస్టులో పెట్టింది. ఫలితంగా అమెరికా కంపెనీల నుంచి ఆయా సంస్థలకు టెక్నాలజీ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోతాయి.

Updated Date - 2021-11-04T12:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising