ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమానంలో బట్టలు విప్పేసి.. సిబ్బందితో అసభ్య ప్రవర్తన !

ABN, First Publish Date - 2021-04-09T16:03:34+05:30

విమానంలో ఓ ప్రయాణికుడు పీకలదాక తాగి హల్‌చల్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విమానంలో ఓ ప్రయాణికుడు పీకలదాక తాగి హల్‌చల్ చేశాడు. బెంగళూరు-ఢిల్లీ ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు పూటుగా తాగి బట్టలు విప్పేసి.. సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఏప్రిల్ 6న బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఐ5-722 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు మొదట లైఫ్ జాకేట్ కోసం విమానం సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఉన్నట్టుండీ ఒంటిపై దుస్తులన్నీ తీసేసి, విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తోటి ప్రయాణికులు, సిబ్బంది బతిమాలడంతో కొద్దిసేపటి తర్వాత కూర్చున్నాడు.


దీంతో ఈ ఘటనపై విమాన పైలట్లు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)కి సమాచారం అందించారు. త్వరగా విమానం ల్యాండింగ్‌కు అనుమతించాలని అభ్యర్థించారు. విమానం ల్యాండ్ కాగానే సదరు ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. అనంతరం ఎయిర్‌లైన్స్ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పాటు ప్రయాణికుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ ఏషియా విమాన సంస్థ ఆ వ్యక్తిని నో ఫ్లై జాబితాలో చేర్చింది. 

Updated Date - 2021-04-09T16:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising