ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో రప్ఫాడిస్తున్న Pushpa.. వారం తిరగకముందే 2 మిలియన్ల మార్క్..

ABN, First Publish Date - 2021-12-23T16:55:07+05:30

పాన్ ఇండియా మూవీగా విడుదలైన 'పుష్ప- ది రైజ్'కు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పాన్ ఇండియా మూవీగా విడుదలైన 'పుష్ప- ది రైజ్'కు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. అటు ఓవర్సీస్‌లోనూ 'పుష్ప' ఫైర్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి. వారం తిరగకముందే 'పుష్ప' ఏకంగా రెండు మిలియన్ల మార్క్‌కు చేరువలో ఉందంటే.. అక్కడ ఈ చిత్రం కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రీమియర్స్‌తోనే భారీ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. వారం చివరికి వచ్చేసరికి కూడా అదే స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 'పుష్ప' యూఎస్‌లో మొత్తం 19 లక్షల 30వేల డాలర్ల(రూ.14.50కోట్లు) గ్రాస్ రాబట్టింది. 


ప్రీమియర్ షోల ద్వారా 5లక్షల 43వేల డాలర్లు(రూ.4.10కోట్లు), తొలి రోజు 4లక్షల 30వేల డాలర్లు(రూ.3.25కోట్లు), రెండో రోజు 3లక్షల 94వేల డాలర్లు(రూ.2.97కోట్లు), మూడో రోజు రెండు లక్షల 57వేల డాలర్లు(రూ.1.94కోట్లు), నాలుగో రోజు లక్ష 22వేల డాలర్లు(రూ.92లక్షలు), ఐదో రోజు లక్ష 12వేల డాలర్లు(రూ.84లక్షలు), ఆరో రోజు 69వేల డాలర్ల(రూ.52లక్షలు) కలెక్షన్స్ వచ్చాయి. ఈ సందర్భంగా 'పుష్ప'ను అమెరికాలో భారీగా విడుదల చేసిన హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశాయి. రెండు మిలియన్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో 'పుష్ప' అంటూ పోస్టర్‌పై ముద్రించాయి. 


అయితే, అగ్రరాజ్యంలో ఈ మూవీని విడుదల చేసిన హాంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నుంచి సుమారు రూ.10కోట్లకు సినిమా రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటికే సుమారు రూ. 14.50కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. ఎందుకంటే షేర్ వైజ్ చూసుకుంటే రూ. 10కోట్లపైనే ఉంటాయి. ఇక మిగతా రన్‌టైంలో వచ్చేవి లాభాలే అన్నమాట. ఇకపోతే మొత్తం రన్‌టైంలో అమెరికన్ బాక్సాఫీస్ వద్ద 'పుష్ప' ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.    

Updated Date - 2021-12-23T16:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising