ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఐదు కారణాల వల్లే Aryan Khan బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..!

ABN, First Publish Date - 2021-10-21T21:56:56+05:30

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్ పిటిషన్ రద్దవడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్ పిటిషన్ రద్దవడానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. 


ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్‌వర్క్‌కు చెందిన డీలర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


సంబంధిత వ్యక్తుల గురించి ఆర్యన్ వద్ద మాత్రమే పూర్తి సమాచారం ఉంది. అయినా ఇప్పటివరకు ఆర్యన్ వారి గురించి నోరు విప్పలేదు. ఆర్యన్‌ను బెయిల్‌పై విడిచి పెడితే సాక్ష్యాలను తుడిచేసే ప్రమాదం ఉంది. 


ఆర్యన్‌కు ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డూ లేకపోయినప్పటికీ.. నిషేధిత డ్రగ్స్ యాక్టివిటీస్‌తో సంబంధం ఉంది. ఎన్‌సీబీ విచారణలో ఎవరూ తమ సప్లయర్స్ గురించి నోరు విప్పలేదు. 


వ్యక్తుల వద్ద డ్రగ్స్ దొరకనప్పటికీ.. స్పాట్‌లో దొరికిన మొత్తం మాదక ద్రవ్యాలకు అక్కడున్న అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. 


ఆర్యన్ వాట్సాప్ ఛాట్‌ ద్వారా భారీ మొత్తంలో డ్రగ్స్ గురించి, హార్డ్ డ్రగ్స్ గురించి సమాచారం లభించింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ సంభాషిస్తున్నట్టు వాట్సాప్ ఛాట్ ద్వారా నిరూపితమైంది. 


ఈ ఐదు కారణాల వల్లే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో ఆర్యన్ ఖాన్ ముంబై హోకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2021-10-21T21:56:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising