ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

California Dixie Wildfire: అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్న కార్చిచ్చు.. 4.80 లక్షల ఎకరాలు బుగ్గిపాలు!

ABN, First Publish Date - 2021-08-10T18:29:21+05:30

అగ్రరాజ్యం అమెరికాను రాకాసి కార్చిచ్చు కలవర పెడుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జులై 14న మొదైలన దావానలం సుమారు 4.80 లక్షల ఎకరాలకు విస్తరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాను రాకాసి కార్చిచ్చు కలవర పెడుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో జులై 14న మొదైలన దావానలం సుమారు 4.80 లక్షల ఎకరాలకు విస్తరించింది. దీంతో ఆ రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటివరకు అధికారులు 12వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో బుట్టే, ప్లమాస్, లాస్సెన్, తెహమా కౌంటీలకు చెందిన వారే 9,500 మంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రస్తుతం సుమారు 8,500 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. గతవారం 2.74 లక్షల ఎకరాల వరకు మాత్రమే విస్తరించిన కార్చిచ్చు.. ఇప్పుడు 4,89,287 లక్షల ఎకరాలకు ఎగబాకడం ఆందోళన కలిగిస్తుందని అధికారులు చెప్పారు. ఇప్పటివకు కనీసం 404 కట్టడాలు బుగ్గిపాలయ్యాయి. దావానలం కారణంగా ప్లమాస్ కౌంటీలోని సుమారు 39 శాతం మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.    


Updated Date - 2021-08-10T18:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising