ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే.. కన్నుమూసిన తండ్రి!

ABN, First Publish Date - 2021-03-01T17:26:00+05:30

కన్న కూతురుని చేతుల్లోకి తీసుకుని.. తనివితీరా ముద్దాడకుండానే ఓ తండ్రి కన్నుమూశాడు. అతని కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన ఓ చారిటీ విరాళాల సేకరణకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ. 84లక్షలను సమకూర్చినట్టు ప్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్ సిటీ: కన్న కూతురుని చేతుల్లోకి తీసుకుని.. తనివితీరా ముద్దాడకుండానే ఓ తండ్రి కన్నుమూశాడు. అతని కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన ఓ చారిటీ విరాళాల సేకరణకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రూ. 84లక్షలను సమకూర్చినట్టు ప్రకటనలో వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు చెందిన  38ఏళ్ల మారిముత్తుకు నలుగురు చెల్లెళ్లు, వృద్ధ తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబానికి అతనే ఆధారం. ఈ క్రమంలో కుటుంబాన్నిపోషించడకోసం మారిముత్తు పన్నేండేళ్ల క్రితం సింగపూర్ వెళ్లాడు. అక్కడే ఓ పరిశ్రమలో పని చేస్తూ.. వచ్చిన డబ్బులను ఇంటికి పంపేవాడు. కాగా.. గత బుధవారం అతను పని చేసే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మారిముత్తు ప్రాణాలు కోల్పోయాడు. 



కాగా.. 2019 ఆగస్ట్‌లో మారిముత్తు చివరిసారిగా ఇండియాను సందర్శించినట్టు తెలుస్తోంది. 10నెలల క్రితమే మారిముత్తు భార్య.. రెండో కూతరుకు జన్మనిచ్చింది. అయితే చిన్న కూతురు పుట్టినప్పటికీ అతను ఇంటికి రాలేదు. వీడియో కాల్‌ ద్వారానే కూతుర్ని చూసి మురిసిపోయేవాడు. చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా కుటుంబ సభ్యులతో అతను వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వలంటీర్ ఆకాష్ మోహపాత్ర మాట్లాడుతూ.. మారిముత్తు కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. Give.Asia అనే ఆన్‌లైన్ చారిటీ మారిముత్తు కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తోంది. 2లక్షల సింగపూర్ డాలర్లను విరాళాల రూపంలో సేకరించి మారిముత్తు కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలో ఆదివారం నాటికి దాదాపు 1.15లక్షల అమెరికన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.84లక్షలు)ను విరాళాల రూపంలో సేకరించినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. 2,141 మంది విరాళాలు అందించినట్టు పేర్కొంది. 


Updated Date - 2021-03-01T17:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising