ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్‌ అసమర్థుడు.. 11 ఏళ్ల కిందటే లాడెన్‌ వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2021-08-24T15:33:26+05:30

జో బైడెన్‌ అసమర్థుడని, ఆయన అమెరికాను సంక్షోభం దిశగా తీసుకెళ్తాడని కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ పదేళ్ల కిందటే చెప్పాడు! అంతేకాదు.. ఆయన్ని చంపొద్దని కూడా అల్‌-కాయిదా ఉగ్రవాదులను ఆదేశించాడు! ఈ విషయాన్ని లాడెన్‌ 2010లో స్వయంగా రాసిన 48 పేజీల లేఖలో పేర్కొన్నాడు. అమెరికాను కుదిపేసిన 9/11 ఉగ్రదాడుల సూత్రధారి లాడెనే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన అధ్యక్షుడైతే అమెరికా పతనమే!

వాషింగ్టన్‌, ఆగస్టు 23: జో బైడెన్‌ అసమర్థుడని, ఆయన అమెరికాను సంక్షోభం దిశగా తీసుకెళ్తాడని కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ పదేళ్ల కిందటే చెప్పాడు! అంతేకాదు.. ఆయన్ని చంపొద్దని కూడా అల్‌-కాయిదా ఉగ్రవాదులను ఆదేశించాడు! ఈ విషయాన్ని లాడెన్‌ 2010లో స్వయంగా రాసిన 48 పేజీల లేఖలో పేర్కొన్నాడు. అమెరికాను కుదిపేసిన 9/11 ఉగ్రదాడుల సూత్రధారి లాడెనే. 2011లో అమెరికా బలగాలు లాడెన్‌ను హతమార్చాయి. ఆ సందర్భంగా సేకరించిన కీలకపత్రాలు, ఇతర సామగ్రిలో ఈ లేఖ కూడా ఉంది. దీన్ని లాడెన్‌ 2010 మేలో తన అనుచరుడు అతియా అబ్దుల్‌ రహ్మాన్‌కు రాశాడు. నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, సీఐఏ డైరెక్టర్‌ డేవిడ్‌ పెట్రా్‌సల విమానాలను లక్ష్యంగా చేసుకోవాలని లాడెన్‌ తన అనుచరులకు సూచించాడు. ఒబామాను హత్య చేస్తే మిగిలిన కాలానికి బైడెన్‌ అధ్యక్షుడు అవుతారని.. అమెరికా పతనం ప్రారంభమవుతుందని ఆకాంక్షించాడు. అప్పట్లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ను హతమార్చవద్దని తెలిపాడు.

Updated Date - 2021-08-24T15:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising