ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ మహిళలపై దాడి చేస్తే జేబుకు చిల్లే

ABN, First Publish Date - 2021-03-15T18:56:27+05:30

పొట్టకూటి కోసం ఏటా వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల బాటపడుతుంటారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యూఏఈకి వెళ్తున్న వారిలో మహిళల సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. ఈ క్రమంలో భా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: పొట్టకూటి కోసం ఏటా వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల బాటపడుతుంటారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యూఏఈకి వెళ్తున్న వారిలో మహిళల సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. ఈ క్రమంలో భారతీయ మహిళలు అక్కడ తమకు రక్షణ కల్పించే చట్టాల గురించి తెలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మహిళలు యూఏఈ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 359 గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. యూఏఈ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 359 ప్రకారం.. ఎవరైనా తమ చేష్టల ద్వారా మాటల ద్వారా మహిళలపై పబ్లిక్‌లో దాడి చేస్తే వారిపై కేసు పెట్టొచ్చు. మాటలు లేదా చర్యల ద్వారా బహిరంగంగా ఆడపిల్లపై దాడి చేస్తే.. సదరు వ్యక్తి కోర్టు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తుంది. లేదా 1,00,000 దిర్హామ్‌ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.19.77లక్షలు) జరిమానా విధిస్తుంది. ఈ జైలు శిక్ష, జరిమానా రెండూ కూడా విధించే అవకాశాలూ ఉన్నాయి. మాటలు లేదా చర్యల ద్వారా బహిరంగంగా ఆడపిల్లపై దాడి చేస్తే యుఎఈలో ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? అనే సందేహాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ వ్యక్త పరిచింది. ఈ క్రమంలో యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పందిస్తూ యూఏఈ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 359 గురించి వివరించింది.




Updated Date - 2021-03-15T18:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising