ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష గ్రీన్‌కార్డులు వృథా.. తీవ్ర నిరాశలో భారతీయులు!

ABN, First Publish Date - 2021-08-06T17:08:42+05:30

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించేది గ్రీన్‌కార్డు. దీనికోసం అగ్రరాజ్యంలో విదేశీయులు చాలా మంది కళ్ళు కాయలు కాచేలా ఏళ్లతరబడి వేచి చూస్తుంటారు. ఇక అధిక సంఖ్యలో గ్రీన్‌కార్డు కోసం పోటీపడేది భారతీయ ఐటీ నిపుణులే. కాగా, గ్రీన్‌కార్డును అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ కంట్రీక్యాప్(దేశాలవారీ కోటా) ఆధారంగా జారీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించేది గ్రీన్‌కార్డు. దీనికోసం అగ్రరాజ్యంలో విదేశీయులు చాలా మంది కళ్ళు కాయలు కాచేలా ఏళ్లతరబడి వేచి చూస్తుంటారు. ఇక అధిక సంఖ్యలో గ్రీన్‌కార్డు కోసం పోటీపడేది భారతీయ ఐటీ నిపుణులే. కాగా, గ్రీన్‌కార్డును అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ కంట్రీక్యాప్(దేశాలవారీ కోటా) ఆధారంగా జారీ చేస్తుండడంతో అగ్రరాజ్యంలో భారీ సంఖ్యలో ఉండే భారతీయులకు అది అందడం గగనంగా మారుతోంది. ఇలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ గ్రీన్‌కార్డు విషయంలో తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త ఇప్పుడు ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.


అదేంటంటే.. ఈ ఏడాది సుమారు లక్ష వరకు గ్రీన్‌కార్డులు వృథా కాబోతున్నాయట. దీనికి కారణం యూఎస్ ఇమ్మిగ్రేషన్‌లో మందకొడిగా కొనసాగుతున్న పనులేనని తెలుస్తోంది. నిధుల సమస్యను ఎదుర్కొంటున్న యూఎస్‌సీఐఎస్‌(యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్)ను మహమ్మారి కరోనా మరింత దెబ్బతీసింది. వైరస్ కారణంగా పనితీరు మరింత నెమ్మదించడంతో పాటు సిబ్బంది కొరత కూడా ఏర్పడినట్లు సమాచారం. దీని ఫలితంగా గ్రీన్‌కార్డుల జారీ మరింత ఆలస్యమవుతోంది. ఇక అగ్రరాజ్యంలో చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌ వ్యహారాలు చూసేది యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సంస్థ.


ఈ సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 2020 అక్టోబరులో లక్షా 20వేల గ్రీన్‌కార్డుల జారీ లక్ష్యంతో తన వార్షిక పనిని మొదలెట్టింది. ఈ సెప్టెంబ‌ర్‌తో ఈ ఏడాది పని పూర్తి కానుంది. అప్పటిదాకా ఎన్ని గ్రీన్‌కార్డులు జారీ చేస్తే అన్ని ఈ ఏడాది కోటాలో పూర్తైనట్లు పరిగణిస్తారు. మిగిలినవన్నీ వృథా అయినట్లే. అయితే, ఇప్పటివరకు ఎన్ని గ్రీన్‌కార్డులు జారీ అయ్యాయో కచ్చితమైన లెక్కలు లేనప్పటికీ.. ఆ దేశ విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్‌హీం జూలైలో ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సమాచారం చాలామంది గ్రీన్‌కార్డు ఆశావహులకు తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. ఈ సెప్టెంబర్ చివరి నాటికి సుమారు లక్ష గ్రీన్‌కార్డులు ఇంకా పెండింగ్‌లో ఉండిపోనున్నాయని చార్లీ పేర్కొన్నారు. అంటే సెప్టెంబరు చివరినాటికి వాటిని జారీ చేయకుంటే అవి వృథా అయినట్లే లెక్క. ఇక ఈసారి గ్రీన్‌కార్డు అవకాశం వచ్చి చేజారితే మళ్లీ ఐదేళ్ల వరకు వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-08-06T17:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising