ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వేగంగా వ్యాపిస్తున్న ఒమైక్రాన్.. మరో 48 గంటల్లో..’ బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్య

ABN, First Publish Date - 2021-12-14T22:44:31+05:30

బ్రిటన్ రాజధాని లండన్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావేద్ సోమవారం వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావేద్ సోమవారం తెలిపారు. మరో 48 గంటల తరువాత రాజధానిలో ఒమైక్రాన్‌యే ప్రబల వేరియంట్‌గా మారుతుందని పేర్కొన్నారు. ‘‘మరే ఇతర కరోనా వేరియంట్ కూడా ఇంత వేగంగా వ్యాపించలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లండన్‌లోని 44 శాతం కరోనా కేసులకు ఒమైక్రాన్ కారణం. ఇక యావత్ ఇంగ్లండ్‌లో దాదాపు 20 శాతం కేసులకు ఈ కొత్త వేరియంట్ కారణమని మంత్రి పేర్కొన్నారు. ఇతర కరోనా వేరియంట్ల కంటే ఒమైక్రాన్ వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు గతంలోనే అంచనా వేశారు. ప్రస్తుతం లండన్‌లోని పరిస్థితులు వారి అంచనాలను నిజమని నిరూపిస్తున్నాయి. 

Updated Date - 2021-12-14T22:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising