ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది సమయం కాదు.. నివాసితులకు కెనడా కీలక సూచన..

ABN, First Publish Date - 2021-12-17T01:50:47+05:30

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా.. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ సెలవు నేప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా.. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ సెలవు నేపథ్యంలో ప్రయాణాలకు సిద్ధం అవుతున్న వారిని ఉద్దేశిస్తూ కెనడా పౌరులు, నివాసితులు.. అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. 



బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెనడా హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ.. ‘క్రిస్మస్ సెలవుల దృష్ట్యా చాలా మంది ప్రజలు.. ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ వారందరికీ ఒక విషయం చెప్పదలచుకున్నా. అనవసరపు ప్రయాణాలను మానుకొండి. అటువంటి ప్రయాణాలకు ఇది సమయం కాదు. మెరుపు వేగంతో ఒమైక్రాన్ విజృంభిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రయాణాలు అంత శ్రేయస్కరం కాదు. ప్రయాణ సమయంలో కొవిడ్ బారినపడే అవకాశం ఉంది. లేకపోతే ఇతర దేశాల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం జరిగిన సమావేశంలో దేశ సరిహద్దుల మూసేసే అంశాన్ని కెనడా ప్రధాని ప్రస్తావించినట్టు సమాచారం. అయితే కొందరు చట్టసభ సభ్యులు దీన్ని వ్యతిరేకించినట్టు సమాచారం. 




Updated Date - 2021-12-17T01:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising