ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమిక్రాన్ కేసులలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకున్నవారే : అమెరికా

ABN, First Publish Date - 2021-12-12T05:37:14+05:30

క‌రోనా కొత్త రూపం ఒమిక్రాన్ అమెరికాలో ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు అగ్రరాజ్యంలో 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క‌రోనా కొత్త రూపం ఒమిక్రాన్ అమెరికాలో ద‌డ పుట్టిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు అగ్రరాజ్యంలో 43 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కానీ ఈ 43 మందిలో రెండు డోసుల తీసుకున్న వారే ఎక్కువ‌. అమెరికాలోని మొత్తం 22 రాష్ట్రాల‌లో ఈ కేసులు న‌మోద‌య్యాయి.


అమెరికా సిడిసి (సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్) తాజా నివేదిక ప్ర‌కారం దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 43 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా.. వీటిలో 34 మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న‌వారున్నారు. వీరిలో 14 మంది బూస్ట‌ర్ డోసు(మూడో డోసు) కూడా తీసుకున్న‌వారు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ 43 కేసుల‌లో 25 మంది 18 నుంచి 39 వ‌య‌సు క‌ల‌వారున్నారు. కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే ఇంత‌కుముందు క‌రోనా సోకిన వారున్నారు. 


సంఖ్యాప‌రంగా ఈ కేసులు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. సిడిసి నివేదికలో గణాంకాల‌ను చూస్తే.. అస‌లు ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయా? వ్యాక్సిన్ల ప్ర‌భావం ఒమిక్రాన్‌పై ఉంటుందా? అనే సందేహాలు క‌లుగుతున్నాయి.

Updated Date - 2021-12-12T05:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising