ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనాపై పోరులో.. భార‌త్‌కు అండ‌గా ఒమ‌న్

ABN, First Publish Date - 2021-05-13T17:36:37+05:30

క‌రోనా సంక్షోభంతో అత‌లాకుత‌లం అవుతున్న భార‌త్‌కు గ‌ల్ఫ్ దేశం ఒమ‌న్ అండ‌గా నిలిచింది. భారీ మొత్తంలో వైద్య సామాగ్రి పంపించి ఆప‌న్న హ‌స్తం అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయంగా భారీ మొత్తంలో వైద్య సామాగ్రి పంపిన గ‌ల్ఫ్ దేశం

మ‌స్క‌ట్‌: క‌రోనా సంక్షోభంతో అత‌లాకుత‌లం అవుతున్న భార‌త్‌కు గ‌ల్ఫ్ దేశం ఒమ‌న్ అండ‌గా నిలిచింది. భారీ మొత్తంలో వైద్య సామాగ్రి పంపించి ఆప‌న్న హ‌స్తం అందించింది. గురువారం ఒమ‌న్ రాయ‌ల్ ఎయిర్ ఫోర్స్‌(ఆర్ ఏఎఫ్‌వో) విమానం వైద్య ప‌రిక‌రాల‌తో ఒమ‌న్ నుంచి బ‌య‌ల్దేరి భార‌త్‌కు చేరుకుంది. వెంటిలేట‌ర్లు, SPO2 మానిట‌ర్లు, ఇత‌ర కీల‌క వైద్య సామాగ్రిని ఈ విమానం తీసుకొచ్చింది. ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో త‌మ‌కు బాస‌ట‌గా నిలిచిన ఒమ‌న్ ప్ర‌భుత్వానికి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం ధ‌న్య‌వాదాలు తెలిపింది. క‌రోనాతో పోరాడుతున్న త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డి.. రెండు దేశాల మ‌ధ్య చిర‌కాల మైత్రి, స్నేహ‌శీల‌త‌ను ఒమ‌న్ మ‌రోసారి చాటింద‌ని భార‌త్ కొనియాడింది. అలాగే ఇదే విమానంలో ఒమ‌న్‌లోని ప్ర‌వాస భార‌తీయులు కూడా త‌మ వంతు సాయంగా 30 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, 100 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పంపించారు. వారికి కూడా భార‌త్ కృతజ్ఞతలు తెలిపింది. 





Updated Date - 2021-05-13T17:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising