ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్సిల్వేనియాలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

ABN, First Publish Date - 2021-01-19T17:40:32+05:30

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ, నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతిని జనవరి 18న అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని చెస్టర్ స్ప్రింగ్స్‌లో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్సిల్వేనియా: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ, నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతిని జనవరి 18న అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని చెస్టర్ స్ప్రింగ్స్‌లో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. తెలుగు చలన చిత్ర రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొంది తెలుగు జాతి ఆత్మగౌరవమే నినాదంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాలకు ఎన్టీఆర్ దశ, దిశ నిర్ధేశం చేశారని బోండా ఉమ తెలిపారు. అభిమానులుగా ఎన్టీఆర్ ఆశయసిద్ధికి నిరంతరం కృషి చెయ్యాల్సిన బాధ్యతను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


ఎన్టీఆర్ స్ఫూర్తిగా అమెరికా రాజకీయాల్లో కూడా తెలుగువారు రాణించే రోజులు రానున్నాయని తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పేర్కొన్నారు. తానా కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగరాజు నలజుల, సతీష్ చుండ్రు, సునీల్ కోగంటి, సాయి జరుగుల, ఫణి కంతేటి, సిద్దు, ప్రసాద్ క్రొత్తపల్లి, గోపి వాగ్వాల, కోటి యాగంటి, చలం పావులూరి, కృష్ణ కొనగళ్ల, రంజిత్ మామిడి, బాలాజీ కరి, కిషోర్ కొంక, సాంబ అంచ, సురేష్ యలమంచి తదితరులు పాల్గొన్నారు.






Updated Date - 2021-01-19T17:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising