ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియాకు వచ్చేందుకు జంకుతున్న NRIలు.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2021-12-27T17:22:46+05:30

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు.. ప్రస్తుతం ఇండియాకు రావడానికి జంకుతున్నారు. ఎక్కడ స్వదేశంలోనే ఉండిపోవాల్సి వొస్తుందో అని హడలిపోతున్నారు. మంచి ఉద్యోగాన్ని చేజేతులా ఎందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు.. ప్రస్తుతం ఇండియాకు రావడానికి జంకుతున్నారు. ఎక్కడ స్వదేశంలోనే ఉండిపోవాల్సి వొస్తుందో అని హడలిపోతున్నారు. మంచి ఉద్యోగాన్ని చేజేతులా ఎందుకు పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. కాగా.. స్వదేశానికి రావడానికి వారికి ఎందుకంత భయం? ఇక్కడకు వస్తే.. వాళ్ల ఉద్యోగాలు ఎందుకు పోతాయ్? అని ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాలు తెలిస్తే.. వారు ఆందోళన చెందడంలో తప్పేమీ లేదని అర్థమవుతుంది. ఇంతకూ విషయం ఏంటంటే..


యూఏఈలోని పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. దీంతో పిల్లలకు సెలవులు దొరికినందువల్ల అక్కడ ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది భారతీయలు.. కుటుంబంతో సహా స్వదేశానికి రావాలని, ఇక్కడ కొన్ని రోజులపాటు గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వారి ఆశలను అడియాసలు చేసింది. భారత్‌లో కూడా కొత్త వేరియంట్ కేసులు వేలుగు చూస్తుండటంతో కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మహారాష్ట్ర వారం రోజులపాటు హోం క్వారెంటైన్ నిబంధనలను తప్పనిసరి చేయగా.. కర్నటక సహా చాలా రాష్ట్రాలు ఎయిర్ పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేశాయి. 



ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న చాలా మంది భారతీయులు.. ఆలోచనలో పడ్డారు. ఒకవేళ కరోనా తీవ్రరూపం దాల్చితే.. గతంలో మాదిరిగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు రద్దవుతాయని, అదే జరిగితే ఇండియాలోనే ఉండిపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు ట్రావెల్ ఏజెంట్లు కూడా స్పష్టం చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఇండియాకు ప్రయాణించే వారి సంఖ్య చాలా తగ్గిందని చెబుతున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న జార్జి థామస్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘గత ఇండియాకు వచ్చినపుడు లాక్‌డౌన్ వల్ల అక్కడే చిక్కుకున్నా. జనవరిలో ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నప్పటికీ.. పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. ఈసారి కూడా స్వదేశంలో చిక్కుకుంటే.. నేను నా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరికొన్ని రోజులపాటు పరిస్థితిని గమనించిన తర్వాత భారత్‌కు రావాలా? వద్దా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటా’ అని అన్నాడు. 




Updated Date - 2021-12-27T17:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising