ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నారై వివాహ మోసాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌

ABN, First Publish Date - 2021-12-18T19:17:53+05:30

ఎన్నారై వివాహ సంబంధిత మోసాల్లో ఉత్తరాది రాష్ట్రాల తర్వాత దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల వివాహ సంబంధ మోసాలు, సంబంధిత చట్టాలపై జాతీయ మహిళా కమిషన్‌, తెలంగాణ పోలీసుల మహిళా భద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ఎన్నారై వివాహ సంబంధిత మోసాల్లో ఉత్తరాది రాష్ట్రాల తర్వాత దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల వివాహ సంబంధ మోసాలు, సంబంధిత చట్టాలపై జాతీయ మహిళా కమిషన్‌, తెలంగాణ పోలీసుల మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. బేగంపేట టూరిజం ప్లాజాలో శుక్రవారం జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రెటరీ ఎం.వి.రమేష్‌, మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య హాజరయ్యారు.   



రేఖా శర్మ మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్‌ వద్ద ఎన్‌ఆర్‌ఐ వివాహాలకు సంబంధించి 5,858 కేసులు నమోదయ్యాయన్నారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ వివాహ మోసాలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్‌కు 15 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 728 ఎన్‌.ఆర్‌ఐ వివాహాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి 18 మహిళా పోలీస్‌ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. సదస్సులో వివిధ దేశాల కాన్సులేట్‌ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-18T19:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising