ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఎన్నారై హత్య.. అనుమానం రాకుండా వెంబడించి..ఆపై..

ABN, First Publish Date - 2021-10-31T04:21:08+05:30

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన శ్రీరంగ అరవపల్లి దారుణ హత్యకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన శ్రీరంగ అరవపల్లి దారుణ హత్యకు గురయ్యారు. దోపిడీ చేసుందుకు ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అరవపల్లిపై కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరోలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. కాగా..నిందితుడిని జాన్ రీడ్‌గా పోలీసులు గుర్తించారు. అంతకుముందు రోజు రాత్రి స్థానిక కెసీనోలో అరవపల్లి  పది వేల డాలర్లు గెలుచుకున్నారు. ఆ తరువాత డబ్బు తీసుకుని ఇంటికి ప్రయాణమయ్యారు. ఇదంతా గమనించిన నిందితుడు..అరవపల్లిని ఆయన ఇంటి వరకూ అనుసరించాడు. ఆయన ఇంట్లోకి వెళ్లగా.. దుండగుడు మాత్రం ఇంటి వెనుకవైపు ఉన్న కిటిలోంచి లోపలికి ప్రవేశించి..అరవపల్లిపై కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన సమయంలో అరవపల్లి భార్య కూతురు పైనున్న గదిలో నిద్రపోతున్నారు.


అయితే..కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అరవపల్లిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించినట్టు ఆస్పత్రిలో వైద్యులు ధృవీకరించారు. మరోవైపు.. పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని పెన్సిల్వేనియాలో అరెస్టు చేశారు. అతడిని న్యూజెర్సీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఆరెక్స్ లేబోరెటరీస్ అనే ఫార్మా సంస్థకు అరవపల్లి సీఈఓగా ఉన్నారు.  

Updated Date - 2021-10-31T04:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising