ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారెవ్వా.. ఈ NRI బాలిక వీడియోను చూస్తే శభాష్ అనాల్సిందే.. ‘బుల్లెట్ బండి’ వధువును మరిపించేసింది..!

ABN, First Publish Date - 2021-08-28T21:46:32+05:30

ప్రస్తుతం బుల్లెట్ బండి పాట సామాజిక మాధ్యమాల్లో ఎంతటి ప్రభంజనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం బుల్లెట్ బండి పాట సామాజిక మాధ్యమాల్లో ఎంతటి ప్రభంజనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడిన ఈ పాట చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ జానపద గీతంపై కొత్తగా పెళ్లైన జంట చేసిన డ్యాన్స్‌‌తో ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది. అప్పటి నుంచి ఈ పాట దుమ్మురేపుతోంది. ఆ తర్వాత చాలా మంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటపై తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు విదేశాల్లోని తెలుగు వారిని కూడా ఈ పాట బాగా అలరిస్తోంది. తాజాగా అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఉండే నైనిక అనే ఎన్నారై చిన్నారి కూడా ఈ జానపదంపై నృత్యం చేసింది. నైనిక డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. 


చిన్నారి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూస్తే నైనిక డ్యాన్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేరు. వారెవ్వా అనాల్సిందే. ఈ పాటపై నవ వధువు చేసిన డ్యాన్స్‌ను కూడా నైనిక మరిపించేసింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 1లక్షకు పైగా వ్యూస్ రాగా, ఐదువేల లైక్స్ వచ్చాయి. చిన్నారి నృత్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. ఒకరు చాలా బాగా డ్యాన్స్ చేశావని, ఎనర్జీ లెవల్ సూపర్ అని అంటే.. మరొకరు పాట చాలా బాగుంది.. నైనిక కూడా అంతే బాగా డ్యాన్స్ చేసిందని కామెంట్ చేశారు. అలాగే డ్యాన్స్ ఇరగదీశావు నైనిక అంటూ మరొకరు.. జూనియర్ సాయి పల్లవి అని, నువ్వు సూపర్ బుజ్జీ అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు.  



Updated Date - 2021-08-28T21:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising