ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI certificate: ఖతార్‌లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం!

ABN, First Publish Date - 2021-07-18T15:13:13+05:30

ఖతార్‌లోని భారత ఎంబసీ ఎన్నారై సర్టిఫికేట్ దరఖాస్తు విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: ఖతార్‌లోని భారత ఎంబసీ ఎన్నారై సర్టిఫికేట్ దరఖాస్తు విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా దరఖాస్తుదారులు అన్ని వర్కింగ్ డేస్‌లో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1 గంటల వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. భారత్‌లోని కళాశాలల్లో ఎన్నారై కేటగిరీలో విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరడానికి ఎన్నారై సర్టిఫికేట్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సర్టిఫికేట్‌ కోసం వస్తున్న ప్రవాసుల సంఖ్య భారీగా పెరగడంతో ఎంబసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అధికారి ట్విటర్ ఖాతా ద్వారా శుక్రవారం ఈ విషయాన్ని ఎంబసీ తెలియజేసింది.


ఇది కేవలం ఎన్నారై సర్టిఫికేట్ దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మిగతా కాన్సులర్ సర్వీసుల కోసం ముందస్తు అపాయింట్‌మెంట్ తప్పనిసరి అని తెలిపింది. ప్రవాసులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా పేర్కొంది. ఇక ఇతర సేవల కోసం ఎంబసీ భారత ప్రవాసులను ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనికోసం ప్రవాసులు https://indianembassyqatar.gov.in/indian_national_reg అనే లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎంబసీ వెల్లడించింది.   


Updated Date - 2021-07-18T15:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising