ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యరాజ్యసమితికే వార్నింగ్ ఇచ్చిన నార్త్ కొరియా

ABN, First Publish Date - 2021-10-04T08:02:29+05:30

పక్క దేశాలకు, తనను విమర్శించిన దేశాలకు వార్నింగ్ ఇవ్వడం నార్త్ కొరియాకు అలవాటే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాంగాంగ్: పక్క దేశాలకు, తనను విమర్శించిన దేశాలకు వార్నింగ్ ఇవ్వడం నార్త్ కొరియాకు అలవాటే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. నార్త్ కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జాన్ ఉన్‌కు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య భారీ స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఈ సారి నార్త్ కొరియా డోస్ పెంచింది. ఏకంగా ఐక్యరాజ్యసమితికే వార్నింగ్ ఇచ్చింది. తమ జోలికొస్తే లేనిపోని ఆ తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.


ఇటీవల నార్త్ కొరియా ఓ మిస్సైల్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నార్త్ కొరియా మిస్సైల్ పరీక్షపైనే కొనసాగింది. ఈ క్రమంలోనే భద్రతా మండని ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై స్పందించిన నార్త్ కొరియా సుప్రీమ్.. భద్రతా మండలి రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని, తాము ఈ పరీక్షలు నిర్వహిస్తే.. సమావేశాలు నిర్వహించి మరీ చర్చిస్తోందని, కానీ ఇలాంటి పరీక్షలే అమెరికా నిర్వహిస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించింది. తమ దేశ సార్వభౌమత్వానికి ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించడం భద్రతా మండలికి మంచిది కాదని, దానికి తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది. భద్రతా మండలికి సైతం నార్త్ కొరియా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.



Updated Date - 2021-10-04T08:02:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising