ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tourist Visa లపై భారత్ కీలక నిర్ణయం.. అలా వచ్చే విదేశీయులకు నో వీసా..

ABN, First Publish Date - 2021-10-12T22:25:22+05:30

టూరిస్ట్ వీసాల విషయమై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మార్గంలో వచ్చే సందర్శకులకు టూరిస్ట్ వీసాలు ఇవ్వబోమని వెల్లడించింది. అంటే మన పొరుగు దేశాలతో పాటు మన దేశ సరిహద్దును పంచుకునే దేశాల నుంచి టూరిస్ట్ వీసాలపై వచ్చేవారు ఈ నిర్ణయం కారణంగా ఇకపై భారత్‌లో అడుగు పెట్టలేరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టూరిస్ట్ వీసాల విషయమై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మార్గంలో వచ్చే సందర్శకులకు టూరిస్ట్ వీసాలు ఇవ్వబోమని వెల్లడించింది. అంటే మన పొరుగు దేశాలతో పాటు మన దేశ సరిహద్దును పంచుకునే దేశాల నుంచి టూరిస్ట్ వీసాలపై వచ్చేవారు ఈ నిర్ణయం కారణంగా ఇకపై భారత్‌లో అడుగు పెట్టలేరు. రోడ్డుమార్గంలో వచ్చే వారికి టూరిస్ట్ వీసాలు ఇవ్వరు కనుక పొరుగు దేశాల సందర్శకులు వాయువు, సముద్రమార్గంలో భారత్‌కు రావొచ్చు. ఇక మన దేశంతో సరిహద్దును పంచుకునే దేశాల జాబితాలో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, మయన్మార్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు కొత్త గైడెలైన్స్ ప్రకారం టూరిస్ట్ వీసాల కోసం అప్లై చేసుకోవాలి.


అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా కొత్త మార్గదర్శకాలను అనుసరించి నూతన వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదిలాఉంటే.. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న టూరిజం రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇటీవల భారత ప్రభుత్వం విదేశీ టూరిస్టులకు బంపరాఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే మొదటి ఐదు లక్షల మందికి ఉచితంగా వీసాలు ఇస్తామని ప్రకటించింది. ఇక భారత్ జారీ చేసే టూరిస్ట్ వీసా సింగిల్ ఎంట్రీ, 30 రోజుల గడువుతో ఉంటుంది.  

Updated Date - 2021-10-12T22:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising