ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ

ABN, First Publish Date - 2021-07-26T01:27:47+05:30

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ మహిళ చరిత్ర సృష్టించారు. ఇండియన్ అమెరికన్ నిషా రామచంద్రన్ కాంగ్రెషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఈ నెల 22న సీఏపీఏసీ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ మహిళ చరిత్ర సృష్టించారు. ఇండియన్ అమెరికన్ నిషా రామచంద్రన్ కాంగ్రెషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఈ నెల 22న సీఏపీఏసీ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘సీఏపీఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఈ వారం కొత్త పాత్రను ప్రారంభించాను. సీఏపీఏసీ చైర్ జూడీ చూ నాయకత్వంలో పని చేసే అవకాశం లభించింది. చాలా సంతోషంగా ఉన్నాను. నాకు మద్దతుగా నిలబడిన వారికి, అభినందనలు తెలిపిన వారికి ధన్యవాదాలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిషా రామచంద్రన్ ఎన్నికవ్వడం పట్ల జూడీ చూ హర్షం వ్యక్తం చేశారు. నిషా రామచంద్రన్.. డెమొక్రటిక్ పార్టీ నేత ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా సహాయకురాలిగా పని చేశారు. కాగా.. 1994లో స్థాపించపడ్డ సీఏపీఏసీ.. నూతన డైరెక్టర్‌గా ఎన్నికై ఆ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా నిషా రామచంద్రన్ గుర్తింపు పొందారు. 


Updated Date - 2021-07-26T01:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising