ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న న్యూజిలాండ్ ప్రధాని

ABN, First Publish Date - 2021-06-18T21:22:30+05:30

న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ శుక్రవారం ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వ్యాక్సిన్ వేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్-19 వ్యతిరేకంగా చేస్తున్న పోరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ శుక్రవారం ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వ్యాక్సిన్ వేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్-19 వ్యతిరేకంగా చేస్తున్న పోరులో టీకా ప్రాముఖ్యతను తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడంలో టీకా ప్రభావవంతంగా పని చేస్తుందని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని ఆమె వ్యాఖ్యానించారు. 2020లో ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం 2021లో ప్రాణాలను రక్షించుకునేందుకు వ్యాక్సిన్ పొందాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇదిలా ఉంటే.. కరోనాని కట్టడి చేసే విషయంలో న్యూజిలాండ్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. దీంతో ఇప్పటి వరకు న్యూజిలాండ్ కేవలం 2,713 కరోనా కేసులే నమోదవ్వగా.. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-06-18T21:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising