ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలసదారులకు Driving license.. మరో సంచలన నిర్ణయం దిశగా Kuwait అడుగులు!

ABN, First Publish Date - 2021-10-07T13:17:22+05:30

వలసదారులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయమై గల్ఫ్ దేశం కువైత్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అంతర్గత మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ అల్ నవాఫ్ తాజాగా ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: వలసదారులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయమై గల్ఫ్ దేశం కువైత్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అంతర్గత మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ అల్ నవాఫ్ తాజాగా ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించారు. అలాగే ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేసే ప్రతిపాదనపై కూడా సంబంధిత అధికారులతో మాట్లాడారు. రోడ్లపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించే క్రమంలో నివాసితులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేయాలని కువైత్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అక్కడి ప్రముఖ ఓ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది. 


అధికారులతో సమావేశమైన షేక్ ఫైజల్ ఈ విషయమై కూలంకషంగా చర్చించిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై అధ్యయనం నిర్వహించి నివాసితులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు మంజూరుకు కొత్త మెకానిజం అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారుల బృందాన్ని ఆదేశించారు. అంతేగాక ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసిన నివాసితుల సంఖ్య, ట్రాఫిక్ రద్దీపై దాని ప్రభావం విషయమై అధ్యయనం నిర్వహించాలని బృందానికి షేక్ ఫైజల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అరబిక్ స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలో ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించడానికి తాజాగా ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే వలసదారులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయమై చర్చించారు.   

Updated Date - 2021-10-07T13:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising