ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్‌ ప్రధాని ఓలికి పార్టీ నుంచి ఉద్వాసన

ABN, First Publish Date - 2021-01-25T14:16:29+05:30

నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రాథమిక సభ్యత్వాన్ని సొంత పార్టీయే రద్దు చేసింది. ఆయన్ను పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాఠ్మాండూ, జనవరి 24: నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రాథమిక సభ్యత్వాన్ని సొంత పార్టీయే రద్దు చేసింది. ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ఠ ప్రకటించారు. పార్టీలో ఓలి వర్గానికి, పుష్ప కమల్‌ దహల్‌ వర్గానికి చాలాకాలంగా విభేదాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. గత నెల 20న నేపాల్‌ పార్లమెంటును రద్దు చేస్తూ ఓలి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఎన్‌సీపీ నిర్ణయించింది. ఎన్‌సీపీ రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో.. ఇకపై ఆ పార్టీ ఓలి వర్గానిదా లేక దహల్‌ వర్గానిదా అన్న విషయాన్ని ఎన్నికల సంఘం తేల్చాల్సి ఉంది.


Updated Date - 2021-01-25T14:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising