ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో భారత సంతతి మహిళకు కీలక పదవి

ABN, First Publish Date - 2021-05-15T13:42:36+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. అగ్రరాజ్య అధినేత జో బైడెన్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండియన్ అమెరికన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. అగ్రరాజ్య అధినేత జో బైడెన్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ‘జో బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ నియమితులయ్యారు. నీరా యొక్క తెలివితేటలు, చిత్తశుద్ధి, రాజకీయ అవగాహన బిడెన్ పరిపాలనకు ఒక ఆస్తి అవుతుంది’ అని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీఏపీ) వ్యవస్థాపకుడు జాన్ పొడెస్తా ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సీనియర్ సలహాదారుగా నీరా టిండాన్ సాధించే విజయాలను చూసేందుకు ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.



కాగా.. మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నీరా టాండన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతంలో నామినేట్ చేశారు. అయితే గతంలో పలువురు నేతలపై చేసిన పాక్షపాత ట్వీట్ల కారణంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జో బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ నియమితులయ్యారు. ఇదిలా ఉంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా నీరా టాండన్ గతంలో పని చేశారు. 


Updated Date - 2021-05-15T13:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising