ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో కరోనా కల్లోలం.. మూడు వారాల్లో 90వేల మరణాలు!

ABN, First Publish Date - 2021-01-16T23:16:13+05:30

కొవిడ్-19 దెబ్బతో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే శవాల దిబ్బగా మారింది. ఈ మహమ్మారికి లక్షల మంది బలయ్యారు. ఈ క్రమంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. అమెరికన్లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కొవిడ్-19 దెబ్బతో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే శవాల దిబ్బగా మారింది. ఈ మహమ్మారికి లక్షల మంది బలయ్యారు. ఈ క్రమంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. అమెరికన్లకు చేదు వార్త చెప్పింది. రాబోయే మూడు వారాల్లో కొవిడ్ కారణంగా అమెరికాలో 90వేల మంది మరణించొచ్చని వెల్లడించింది. సీడీసీ శుక్రవారం రోజు ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 2కోట్లు దాటింది. 3.91లక్షల మంది కొవిడ్-19 కాటుకు బలయ్యారు. కాగా.. సీడీసీ నివేదిక ప్రకారం ఫిబ్రవరి 6 నాటికి అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య 4.40 - 4.77లక్షల మధ్య ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారాంతం (6వ తేదీ) నాటికి 16,200 నుంచి 29,600 వరకు కొవిడ్ మరణాలు నమోదవ్వొచ్చని సీడీసీ తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. జనవరి మొదటి రెండు వారాల్లోనే అమెరికాలో కొవిడ్ కారణంగా దాదాపు 38వేల మందికిపైగా మరణించినట్టు సీఎన్‌ఎన్ తెలిపింది. 


Updated Date - 2021-01-16T23:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising