ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6 లక్షల మంది విదేశీ ఉద్యోగులకు షాకిచ్చిన kuwait.. వాళ్ల అరెస్టుకూ రెడీ..!

ABN, First Publish Date - 2021-09-06T21:37:57+05:30

లక్షల మంది ప్రజలకు కువైత్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కువైత్ ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులు కువైత్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్: లక్షల మంది ప్రజలకు కువైత్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కువైత్ ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 4 లక్షల మంది విదేశీ ఉద్యోగులు కువైత్‌లో అడుగుపెట్టే అర్హత కోల్పోయారు. అంతేకాకుండా నివాస అనుమతి గడువు ముగిసిపోయినప్పటికీ ఇంకా తమ దేశంలోనే ఉన్నవారిని అరెస్టులు చేసేందుకు కువైత్ ప్రభుత్వం సిద్ధమైంది.


కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కువైత్ ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నరగా విమానాశ్రయాలను మూసివేసింది. అప్పటికే కువైత్‌లో ఉద్యోగాలు చేస్తున్న అనేకమంది విదేశీయుల్లో కొంతమంది వివిధ కారణాలతో తమ దేశాలకు వెళ్లి ఉండడంతో వారంతా తిరిగి కువైత్‌కు రాలేకపోయారు. కువైత్‌లోనే ఇరుక్కుపోయిన మిగిలిన విదేశీ ఉద్యోగులు తమ దేశాలకు వెళ్లలేకపోయారు.


ఏడాదిన్నర గడిచిపోవడంతో విదేశీ ఉద్యోగుల నివాస అనుమతుల గడువు(రెసిడెన్సీ పర్మిట్స్) కూడా పూర్తయింది. ఇతర దేశాల్లో చిక్కుకున్నవారికి తిరిగి అనుమతులు పొడిగించేందుకు వారి సంస్థలు(స్పాన్సరర్స్) ఎలాంటి దరఖాస్తులూ చేయకపోవడంతో ఆయా ఉద్యోగుల రెసిడెన్సీ పర్మిట్స్ రద్దయ్యాయి. వారితో పాటు కువైత్‌లోనే ఇరుక్కుపోయిన దాదాపు 1.5 లక్షల మంది విదేశీ ఉద్యోగుల రెసిడెన్సీ పర్మిట్స్ గడువు కూడా పూర్తయింది. అయితే తమ పర్మిట్స్ పొడింగించాలని వారంతా కోరుకున్నప్పటకీ.. కువైత్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అంతేకాకుండా పర్మిట్ గడువు పూర్తయినా దేశంలో ఉన్న వారిని వెంటనే అరెస్టు చేసి దేశం నుంచి పంపించేందుకు ప్రణాళికలూ సిద్ధం చేస్తోంది.

Updated Date - 2021-09-06T21:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising