ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dallas లో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిన 'నాట్స్'

ABN, First Publish Date - 2021-11-09T13:57:16+05:30

అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అమెరికాలో తెలుగువారి కోసం ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాల్లస్, టెక్సాస్: అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అమెరికాలో తెలుగువారి కోసం ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డాలస్‌లో దాదాపు 500 మందికిపైగా తెలుగు చిన్నారులకు వ్యాక్సిన్స్ వేశారు. ఇందులో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న పెద్దలకు బూస్టర్ డోస్ ఇచ్చారు. గ్రేట్ ఫార్మసీ, అండ్ ఇండిపెండెన్స్  ఫార్మసీ వాళ్ల సహకారంతో నాట్స్ ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించింది. నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాట్స్ డాలస్ విభాగం నాయకులు స్థానిక తెలుగువారికి ఈ వ్యాక్సిన్ డ్రైవ్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకునేలా చేశారు. 


నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్ కిషోర్వీర గంధం, ఆది గెల్లి, కిషోర్ కంచర్ల, ప్రేమ్ కుమార్‌లతో పాటు జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చాప్టర్ కోఆర్డినేటర్స్ రాజేంద్ర కాట్రగడ్డ, రాజేంద్ర యనమల తదితర స్థానిక డాలస్ నాట్స్ విభాగ నాయకులంతా ఈ కార్యక్రమం దిగ్విజయంచేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారంతా నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ తెలుగువారి పట్ల బాధ్యతతో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిందని అభినందించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని టెక్సాస్ చాప్టర్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ పలు ఇతర చాఫ్టర్స్ కూడా ఇదేవిధమైన స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



Updated Date - 2021-11-09T13:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising