ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతరిక్ష రహస్యాలను ఛేదించే టెలిస్కోప్‌ను ఆవిష్కరించిన నాసా

ABN, First Publish Date - 2021-12-05T13:12:24+05:30

అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక భారీ టెలిస్కోప్‌ను ఆవిష్కరించిందని సమాచారం. ఈ టెలిస్కోప్ ద్వారా ఈ అనంత విశ్వంలోని రహస్యాలు తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యాయంగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ టెలిస్కోప్ పేరు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక భారీ టెలిస్కోప్‌ను ఆవిష్కరించిందని సమాచారం. ఈ టెలిస్కోప్ ద్వారా ఈ అనంత విశ్వంలోని రహస్యాలు తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యాయంగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ టెలిస్కోప్ పేరు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.


జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఒకరకంగా టైమ్ మెషీన్‌లాగా పనిచేస్తుందట.. ఎందుకంటే ఈ పరికరం ద్వారా మనం ఈ అనంత విశ్వం పుట్టినప్పుడు ఎలా ఉందో చూడవచ్చునని వారు చెబుతున్నారు. ఈ టెలిస్కోప్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వేల కోట్ల సంవత్సరాల కిందట.. బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టినప్పుడు దూసుకొచ్చిన కాంతి ఇప్పుడు విశ్వంలో ఎక్కడ ఉన్నా దానిని ఇది చూపిస్తుంది. అంటే విశ్వంలో మనకు అత్యంత దూరంగా ఉన్న గెలాక్సీలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, అన్నింటినీ అత్యంత స్పష్టంగా ఈ టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు. 


అంతేకాదు…వందల కోట్ల సంవత్సరాల్లో గెలాక్సీ(పాలపుంత)లు ఎలా పుట్టాయి, ఎలా పెరిగాయి, ఎలా విస్తరించాయి, ఎలా ఢీకొట్టుకున్నాయి, ఎలా కలిసిపోయాయి, అనే అంశాలను సైతం ఈ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటివి చూపించడంలో హబుల్ టెలిస్కోప్ చాలా బాగా ఉపయోగపడింది. కానీ దాని కాలం అయిపోవడంతో దాని స్థానంలో ఈ కొత్త టెలిస్కోప్‌ను శాస్త్రవేత్తలు తీసుకువచ్చారు.


ఈ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఇతర గ్రహాలపై వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఈ టెలిస్కోప్‌ను నాసా 2021 డిసెంబర్ 18వ తేదీన లాంచ్ చేయనుంది. లాంచ్ చేశాక ఇది అంతరిక్షంలోకి వెళ్లి.. భూమికి లక్షల మైళ్ల అవతల సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది భూమికీ, చంద్రుడికీ మధ్య ఉన్న దూరం కంటే 4 రెట్లు ఎక్కువ. ఇక సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో వేడిని తట్టుకునేలా దీనికి హీట్ సెన్సిటివ్ విజన్ కూడా ఉంది. దీన్నే సన్ షీల్డ్ అంటారు. ఇది అతి వేడి, అతి చల్లదనం నుంచి టెలిస్కోప్‌ను కాపాడుతుంది. ఈ టెలిస్కోపుకి 18 సెగ్మెంట్ ప్రైమరీ మిర్రర్ ఉంటుంది. 6.5 మీటర్ల వ్యాసార్థంతో ఉండే ఈ మిర్రర్‌ ద్వారా ఈ టెలిస్కోప్ విశ్వ రహస్యాల్ని చూపిస్తుంది. ఈ టెలిస్కోప్‌ని 14 దేశాలు కలిసి తయారుచేసాయి. 1200 మంది సైంటిస్టులు, ఇంజనీర్లూ దీని నిర్మాణంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ టెలిస్కోప్‌ని స్పేస్‌క్రాఫ్ట్‌కి సెట్ చేస్తున్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తయ్యాక.. ఫ్రెంచ్ గయానాకు తరలిస్తారు. అక్కడ డిసెంబర్ 18న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అరియానే 5 రాకెట్ దాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది.


Updated Date - 2021-12-05T13:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising