అమెరికాలోనే దేవరకొండ టెకీ అంత్యక్రియలు
ABN, First Publish Date - 2021-01-05T12:40:14+05:30
నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నల్లమాద దేవేందర్‌రెడ్డి(44) అంత్యక్రియలు సోమవారం అమెరికాలో నిర్వహించారు.
దేవరకొండ/నల్లగొండ (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నల్లమాద దేవేందర్‌రెడ్డి(44) అంత్యక్రియలు సోమవారం అమెరికాలో నిర్వహించారు. దేవేందర్‌రెడ్డి గత నెల 29న అమెరికాలోని తన ఇంటి వద్ద పార్కు చేసి ఉన్న కారును స్టార్ట్ చేయగా మంటలు అంటుకుని అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికాలోని బంధుమిత్రుల సూచనల మేరకు ఆయన భార్య అనురాధ అక్కడే అంత్యక్రియలు నిర్వహించారని దేవేందర్‌రెడ్డి మామ వెంకటరమణరెడ్డి తెలిపారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో సంతాపసభ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
Updated Date - 2021-01-05T12:40:14+05:30 IST