ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్క్ పర్మిట్ల విధానంపై Kuwait మంత్రి మండలి కీలక సూచన.. వచ్చే ఏడాది నుంచి వలసదారులపై అదనపు భారం!

ABN, First Publish Date - 2021-10-05T13:19:12+05:30

వలసదారుల వర్క్ పర్మిట్ విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్(పీఏఎం)కు కువైత్ మంత్రి మండలి తాజాగా కీలక సూచన చేసింది. వర్క్ పర్మిట్ల విధానాన్ని అప్‌డేట్ చేయాలని కోరింది. దీంతోపాటు తప్పనిసరిగా వర్క్ పర్మిట్ రుసుము పెంచాలని మంత్రి మండలి సూచించింది. అలాగే పీఏఎం అందించే సేవల మీద కూడా ఫీజు పెంచాలని ప్రతిపాదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: వలసదారుల వర్క్ పర్మిట్ విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్(పీఏఎం)కు కువైత్ మంత్రి మండలి తాజాగా కీలక సూచన చేసింది. వర్క్ పర్మిట్ల విధానాన్ని అప్‌డేట్ చేయాలని కోరింది. దీంతోపాటు తప్పనిసరిగా వర్క్ పర్మిట్ రుసుము పెంచాలని మంత్రి మండలి సూచించింది. అలాగే పీఏఎం అందించే సేవల మీద కూడా ఫీజు పెంచాలని ప్రతిపాదించింది. అంతేగాక విదేశీ కార్మికుల వీసాల రుసుము సైతం పెంచనున్నారు. వర్క్ పర్మిట్ల విధానాన్ని అప్‌డేట్ చేయడం ద్వారా రెసిడెన్సీ ట్రేడ్, మార్జినల్ వర్కర్స్ విధాన్ని తొలగించనున్నారు. 


కాగా, 2022 ద్వితీయార్థంలో లేదా త్రైమాసికం నాటికి ఈ ప్రతిపాదనను పూర్తి చేసి, అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఇక ఈప్రణాళిక ప్రకారం ప్రతి రంగంలో ఉపాధి కోటాలు ఉంటాయి. అలాగే ప్రవాస, జాతీయ కార్మికుల కోసం ఆర్థిక కార్యకలాపాలు ఉండనున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా ప్రైవేట్ రంగంలో దేశీయ కార్మిక భర్తీ శాతాన్ని 2022 ప్రారంభంలో 5శాతంతో ప్రారంభించి 2025 చివరి నాటికి 20శాతానికి పెంచాలని ఈ సందర్భంగా మంత్రి మండలి నిర్ణయించింది.

Updated Date - 2021-10-05T13:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising