ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌లో సంస్కృత భాష కోర్సులను ప్రోత్సహించేందుకు సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్ కృషి!

ABN, First Publish Date - 2021-12-24T23:04:21+05:30

బ్రిటన్‌లో సంస్కృత భాష, భారతీయ సంస్కృతిని ప్రోత్సోహించే దిశగా అక్కడి సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్, భారత్‌లోని సంస్కృతి సంవర్ధన్ అండ్ సంషోధన్ ప్రతిష్ఠాన్(ఎస్ఎస్అండ్ఎస్‌పీ) మధ్య అవగాహన ఒప్పందం(ఎమ్ఓయూ) కుదిరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిటన్‌లో సంస్కృత భాష, భారతీయ సంస్కృతిపై రూపొందించిన కోర్సులను ప్రోత్సోహించే దిశగా అక్కడి సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్సెలెన్స్, భారత్‌లోని సంస్కృతి సంవర్ధన్ అండ్ సంషోధన్ ప్రతిష్ఠాన్(ఎస్ఎస్ఏఎస్‌పీ) మధ్య  అవగాహన ఒప్పందం(ఎమ్ఓయూ) కుదిరింది. సంస్కృత భాష, భారత దేశ సంస్కృతిపై బ్రిటన్‌లో వివిధ కోర్సులు తీసుకురావడంతో పాటూ ఆయా అంశాల్లో పరిశోధన జరిపేందుకు వీలుగా రెండు సంస్థలు.. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ కోర్సులకు కవికుల గురు కాళిదాస్ యూనివర్శిటీ గుర్తింపు కూడా ఉంది.  సంస్కృతి సెంటర్ వ్యవస్థాపకురాలు వింజమూరి రాగసుధ, ఎస్ఎస్ఏఎస్‌పీ వ్యవస్థాపకుడు దిలీప్ కరమ్‌బేల్కర్.. ప్రొ. కళా ఆచార్య సమక్షంలో ఈ ఎమ్ఓయూపై సంతకాలు చేశారు. బ్రిటన్‌లోని అనేక యూనివర్శిటీలు సంస్కృతంలో కోర్సులు అందిస్తున్నప్పటికీ ఓ భారతీయ యూనివర్శిటీ గుర్తింపు పొందిన కోర్సులను బ్రిటన్‌లో ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం ఓ మైలురాయని రెండు సంస్థల నిర్వహకులు పేర్కొన్నారు.   



Updated Date - 2021-12-24T23:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising