ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. 20కోట్ల మందికి కొవిడ్ టీకా!

ABN, First Publish Date - 2021-04-17T21:07:54+05:30

అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 20 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇచ్చినట్టు అమెరికా ప్రకటించింది. అమెరికాలో శుక్రవారం నాటికి 20 కోట్ల మంది ప్రజలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 20 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇచ్చినట్టు అమెరికా ప్రకటించింది. అమెరికాలో  శుక్రవారం నాటికి 20 కోట్ల మంది ప్రజలు కొవిడ్ టీకాను అందుకున్నారని సీడీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో దాదాపు 8కోట్ల మందికిపైగా ప్రజలు టీకా రెండు డోసులను తీసుకోగా.. మిగిలిన వారు మొదటి డోసు తీసుకున్నట్టు వివరించింది. అంతేకాకుండా.. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న టీకా కేంద్రాలకు 25.8కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసున్నట్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని ప్రజలకు మోడెర్నా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను అందిస్తున్నట్టు సీడీసీ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్‌లోని సమారం ప్రకారం గడిచిన 24 గంటల్లో అమెరికాలో 80వేల కరోనా కేసులు నమోదవ్వగా దాదాపు 900 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కేసుల సంఖ్య 3.23కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 5.80లక్షలకు చేరింది. 


Updated Date - 2021-04-17T21:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising