ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MEA: అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక సూచన!

ABN, First Publish Date - 2021-08-20T17:20:18+05:30

అఫ్ఘానిస్థాన్‌ ప్రస్తుతం తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నుంచి చాలా మంది విదేశీయులు స్వదేశాలకు తరలిపోతున్న వైనం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌ ప్రస్తుతం తాలిబన్ల కబంద హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నుంచి చాలా మంది విదేశీయులు స్వదేశాలకు తరలిపోతున్న వైనం. ఇక ఇప్పటికే భారత్ కూడా కాబూల్‌లోని ఎంబసీ సిబ్బందితో పాటు పలువురు ప్రవాసులను ఎయిర్‌ఫోర్స్ విమానంలో స్వదేశానికి తరలించింది. ఇంకా కొంతమంది భారతీయులు అఫ్ఘాన్‌లోనే చిక్కుకుని ఉన్నారు. వారిని కూడా భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకున్న భారత ప్రవాసులకు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) తాజాగా కీలక సూచన చేసింది. కాబూల్ నుంచి రాయబార కార్యాలయ సిబ్బంది మొత్తాన్నీ తరలించిన నేపథ్యంలో అక్కడి భారతీయులు మన ప్రభుత్వం సాయం పొందడానికి వీలుగా ఎంఈఏ ‘స్పెషల్‌ అఫ్ఘానిస్థాన్‌ సెల్‌’ను ఏర్పాటు చేసింది.


కనుక అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులు సహాయం కోసం 24x7 పనిచేసే ఈ స్పెషల్‌ సెల్‌‌ను సంప్రదించాల్సిందిగా విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విటర్ వేదికగా స్పెషల్‌ సెల్‌ పూర్తి సమాచారాన్ని షేర్ చేశారు. సహాయం అవసరమైన భారతీయులు ఈ-మెయిల్ కూడా పంపవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే స్పెషల్ సెల్ ఫోన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లను కూడా బాగ్చి తెలియజేశారు. కాగా, 'స్పెషల్‌ అఫ్ఘానిస్థాన్‌ సెల్‌‌'కు ఇప్పటివరకు వచ్చిన కాల్స్‌ ఆధారంగా అక్కడ సుమారు 450 మంది వరకు మనోళ్లు ఉన్నట్టు అంచనా. 


అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులు సంప్రదించాల్సిన స్పెషల్ సెల్ ఫోన్ నంబర్లు: +91-11-49016783, +91-11-49016784, +91-11-49016785 

వాట్సాప్ నంబర్లు: +91 8010611290, +91 9599321199, +91 7042049944   

ఈ-మెయిల్: SituationRoom@mea.gov.in



Updated Date - 2021-08-20T17:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising