ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రాష్ట్రానికి 10 కాన్సంట్రేట‌ర్స్‌.. MATA ఔన్నత్యం

ABN, First Publish Date - 2021-05-19T00:09:25+05:30

క‌రోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌ తీవ్రమవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజ‌న్ కొర‌త‌ను త‌గ్గించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం విశేషంగా కృషి చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క‌రోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌ తీవ్రమవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజ‌న్ కొర‌త‌ను త‌గ్గించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం తమవంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. జర్మనీలోని మన తెలుగు అసోసియేషన్(MATA) 10  ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్స్‌ను రాష్ట్రానికి అందించిందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ అన్ని విధాలుగా కరోనా కట్టడికి కృషి చేస్తోందన్నారు. అలాగే ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు స్పందిస్తున్న కేటీఆర్, కవితలకు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారని మహేశ్ చెప్పారు. 


ఎన్నారైలు ఎవరైనా తెలంగాణ ప్రభుత్వానికి ఈ కరోనా సమయములో సహాయం చెయ్యాలంటే  ప్రభుత్వం నియమించిన కోవిద్ రిలీఫ్ నోడల్ ఆఫీసర్ రోనాల్డ్ రోస్ ఐఏఎస్‌ను (splsecretaryfinance@telangana.gov.in) ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు. అలాగే తన దృష్టికి తీసుకువచ్చినా ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని తీసుకెళ్తానని తెలిపారు. హైదరాబాద్‌లో 100 టన్నుల ప్లాంటు, 10 రోజుల్లోగా 11 ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఏర్పాటు, ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరత రావొద్దని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా MATA  సభ్యులు శ్రీనివాస్ కళ్లేపల్లి, రాజు చిలక తదితరులను మహేశ్ బిగాల అభినందించారు.

Updated Date - 2021-05-19T00:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising