ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసలే చిన్న గది.. బాంబులేయకు.. భరించలేకపోతున్నాం.. అంటూ తోటి ఉద్యోగి హెచ్చరించడంతో విసిగిపోయిన అతడు చివరికి..

ABN, First Publish Date - 2021-12-23T22:58:13+05:30

చిన్న గదిలో పదే పదే అపానవాయువు వదలద్దంటూ తోటి ఉద్యోగి సూచించడంతో తన పరువు పోయిందంటూ కేసు వేసిన ఓ వ్యక్తికి కోర్టులో నిరాశే ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: చిన్న గదిలో పదే పదే అపానవాయువు వదలద్దంటూ తోటి ఉద్యోగి సూచించడంతో తన పరువు పోయిందంటూ కేసు వేసిన ఓ వ్యక్తికి కోర్టులో నిరాశే ఎదురైంది. అతడి ఫిర్యాదులో పసలేదంటూ కోర్టు అతడి కేసును కొట్టేసింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీసు( క్రౌన్ ప్రొటెక్షన్ సర్వీస్)లో ఉద్యోగి అయిన తారీఖ్ మహ్మద్.. తన క్రౌన్ ప్రొటెక్షన్ సర్వీసుపైనే  ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశాడు. తనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా పని ప్రదేశంలో  వివక్ష ఎదుర్కొంటున్నానని వాపోయాడు. పదే పదే అపానవాయువు వదలద్దంటూ ఓ సహోద్యోగి పలుమార్లు బహిరంగంగా సూచించి తన పరువుకు భంగం కలిగించాడని వాపోయాడు. తనకు 2014లో గుండెపోటు వచ్చిందని, ఈ క్రమంలో వాడే మందుల కారణంగా తనకు పదే పదే అపానవాయువు వస్తుంటుందని చెప్పుకొచ్చాడు. 


అంతేకాకుండా.. పని గంటల విషయంలోనూ ఆఫీసు యాజమాన్యం తనకు తగిన మినహాయింపులు ఇవ్వలేదని ట్రిబ్యూనల్‌కు తెలిపాడు. ఈ కారణాలన్నీ పేర్కొంటూ మహ్మద్.. తాను ఆఫీసులో వివక్ష ఎదుర్కొన్నానని, తనకు పరిహారం ఇప్పించాలంటూ కోర్టును కోరాడు.  అయితే.. మహ్మద్ చేసిన కొన్ని ఆరోపణలు నిజమేనని కోర్టు అంగీకరించింది. అతడి ఆరోగ్యకారణాల రీత్యా వారానికి రెండు రోజుల పాటు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఈ విషయంలో క్రౌన్ ప్రొటెక్షన్ సర్వీసు మహ్మద్‌కు పరిహారం ఇవ్వాలని, అతడితో చర్చలు జరిపి ఈ విషయమై ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. అయితే.. అపానవాయువు వదలద్దంటూ తోటి ఉద్యోగి చేసిన సూచనలో తప్పేమీ లేదని స్పష్టం చేసింది. పదే పదే అపానవాయువు వస్తున్నప్పుడు బయటకు వెళ్లి తన సమస్య తీర్చుకోవాలని మాత్రమే అతడు సూచించాడని, ఇందులో మహ్మద్ పరువు తీసే వ్యాఖ్యలు ఏమీ లేవని తేల్చి చెప్పింది. మహ్మద్ వేసుకుంటున్న మందుల కారణంగానే ఇలా జరిగిందన్న విషయం అతడి సహోద్యోగికి తెలియదన్న విషయాన్ని కూడా కోర్టు పరిణగనలోకి తీసుకుంది. 



Updated Date - 2021-12-23T22:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising