ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌లో ఇరుక్కున్న యువకుడు.. టైంపాస్ కోసం మొసళ్ల నదిలోకి దూకేశాడు.. చివరికి

ABN, First Publish Date - 2021-07-16T22:09:03+05:30

ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకోకుండా ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే సాధారణంగా ఎవరైనా కాలక్షేపం కోసం పాటలు వినడమో లేక సినిమా చూడటమో చేస్తుంటారు. ఇదేదీ కాకపోతే టైంపాస్ కోసం సోషల్ మీడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకోకుండా ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే సాధారణంగా ఎవరైనా కాలక్షేపం కోసం పాటలు వినడమో లేక సినిమా చూడటమో చేస్తుంటారు. ఇదేదీ కాకపోతే టైంపాస్ కోసం సోషల్ మీడియా ఉండనే ఉంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎంతకీ ఏం జరిగిందంటే..



అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన జెమ్మీ ఇవాన్ జెన్నింగ్స్ (26) అనే యువకుడు.. తన ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా  బయటికొచ్చాడు. అతడు తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డుపై రెండు కార్లు ఢీ కొన్నాయి. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జెమ్మీ, తన స్నేహితులు ప్రయాణిస్తున్న వాహనం కూడా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంది. దీంతో సుమారు రెండు గంటలపాటు కారులో కూర్చున్న జెమ్మీకి.. బోర్ కొట్టేసింది. తన చుట్టూ పరిసరాలను గమనించాడు. తనకు దగ్గర్లో ఓ నది ప్రవహిస్తున్నట్టు గుర్తించాడు. ఇకేముంది.. ముందు వెనక ఆలోచించకుండా ఈత కొట్టేందుకు 100 అడుగుల ఎత్తు నుంచి నదిలోకి దూకేశాడు. కాగా.. ఈ విషయం తెలిసి అధికారులంతా ఒక్కసారిగా షాకయ్యారు. మొసళ్లు అధికంగా ఉండే అచ్చఫాలయ నదిలో.. జెమ్మీ దూకడంపట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 


మొసళ్ల బారి నుంచి జెమ్మీ ప్రాణాలతో బయటపడతాడా అనే సందేహం వ్యక్తం చేశారు. అయితే అతని అదృష్టం బాగుండటంతో జెమ్మీ.. మొసళ్ల బారినపడలేదు. 100 అడుగుల ఎత్తు నుంచి దూకడం వల్ల అతని కాలికి దెబ్బ తగలడంతో అతికష్టం మీద నదిని ఈది జెమ్మీ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ క్రమంలో అప్పటికే ఒడ్డున పోలీసు అధికారులు జెమ్మీని అరెస్ట్ చేశారు. కాగా.. నదిలో మొసళ్లు సంచరిస్తాయనే విషయం తనకు అస్సలు తెలియదని జెమ్మీ తెలిపాడు. తెలిసుంటే.. అసలు నదిలోకి దూకేవాడినేకాదని పేర్కొన్నాడు. పై నుంచి దూకడం వల్ల కాలికి గాయమైనట్టు చెప్పాడు. దీంతో నదిలో ఈదడం తనకు కష్టంగా మారిందని.. ఈత కొడుతున్నంత సేపూ.. ప్రాణాలతో బయటపడాలని భగవంతుడిని ప్రార్థించినట్టు మీడియాకు చెప్పాడు. 


Updated Date - 2021-07-16T22:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising