ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక వృత్తిగా ఆ ఉద్యోగం.. H-1B ఉద్యోగులపై ఆధారపడే కంపెనీల హర్షం!

ABN, First Publish Date - 2021-10-30T19:23:42+05:30

అగ్రరాజ్యం అమెరికా దేశంలోని కంపెనీలకు విదేశీ నిపుణుల నియామకాల కోసం హెచ్-1బీ వీసాలు మంజూరు చేస్తుందన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా దేశంలోని కంపెనీలకు విదేశీ నిపుణుల నియామకాల కోసం హెచ్-1బీ వీసాలు మంజూరు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇలా విదేశీ నిపుణులకిచ్చే హెచ్​-1బీ వీసాలలో 'మార్కెట్​ రీసెర్చ్​ ఎనలిస్ట్'​ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణిస్తూ యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల(యూఎస్​సీఐఎస్​) విభాగం కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆమోదించింది. దీంతో హెచ్​-1బీ ఉద్యోగులపై ఆధారపడే కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అమెరికాలోని ఉద్యోగాలతో కూడిన ఓ జాబితాను డిపార్ట్​మెంట్​ ఆఫ్​ లేబర్స్​ బ్యూరో ఆఫ్​ లేబర్​ స్టాటిస్టిక్స్​ రూపొందించింది.


అయితే, ఈ జాబితాలో 'మార్కెట్​ రిసెర్చ్​ ఎనలిస్ట్'​ ఉద్యోగం లేనందున ఆ ఉద్యోగాన్ని ప్రత్యేక వృత్తిగా పరిగణించలేమని యూఎస్​సీఐఎస్​ తేల్చి చెప్పింది. దీంతో హెచ్​1బీ ఉద్యోగులపై ఆధారపడే కంపెనీలకు ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆమోదించిన ఒప్పందం ప్రకారం.. గతంలో కొట్టివేసిన తమ హెచ్​1బీ పిటిషన్లను యూఎస్​సీఐఎస్​ పునరుద్ధరించేందుకు కంపెనీలు విజ్ఞప్తి చేసుకునే వీలు ఏర్పడింది. ఈ ఒప్పందంతో వేలాది అగ్రరాజ్యం కంపెనీలకు లబ్ధి చేకూరునుంది. ఇక అగ్రరాజ్యం ప్రతియేటా 65వేల రెగ్యూలర్, 20వేల మాస్టర్ క్యాప్ హెచ్-1బీ వీసాలు మంజూరు చేస్తుంది. ఇలా విదేశీ నిపుణుల నియామకాల కోసం మొత్తం 85వేల హెచ్-1బీ వీసాలు ఇస్తుంది. వీటిలో భారత్, చైనా నుంచే అత్యధికంగా ఈ వీసాలు పొందడం జరుగుతుంది.   

Updated Date - 2021-10-30T19:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising