ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ వైపు మొగ్గుచూపని విదేశీ, ఎన్నారై విద్యార్థులు!

ABN, First Publish Date - 2021-06-14T18:17:00+05:30

కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ఇండియాలోని విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విదేశీ, ఎన్నారై విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముంబై యూనివర్సిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ఇండియాలోని విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విదేశీ, ఎన్నారై విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముంబై యూనివర్సిటీలో ఈ ఏడాది ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. 2018-19, 2019-20 విద్యాసంవత్సరాల్లో ముంబై యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విదేశీ, ఎన్నారై విద్యార్థుల సంఖ్య వరుసగా 209, 227 ఉండగా..  2020-21 సంవత్సరంలో వారి సంఖ్య సగానికి పడిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్‌లో కేవలం 101 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్‌ పొందినట్టు గణాకాంలు చెబుతున్నాయి.



ఉన్నత విద్య కోసం నేపాల్ నుంచి ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ఇండియాకు వచ్చి, ముంబై యూనివర్సిటీలో ప్రవేశం పొందుతారు. కానీ ఈ సంవత్సరం నేపాల్ విద్యార్థుల సంఖ్య సింగల్ డిజిట్‌కే పరితమైంది. 2020-21 విద్యాసంవత్సరంలో కేవలం ఐదుగురు మాత్రమే అడ్మిషన్ పొందారు. ఇదే విధంగా ఆఫ్గనిస్థాన్ విద్యార్థుల సంఖ్య 42 నుంచి ఒకటికి పడిపోయింది. విదేశీ విద్యార్థులను పక్కన పెడితే.. ఎన్నారై విద్యార్థులు కూడా ఈసారి ముంబై యూనివర్సిటీలో (ఎంయూ) ప్రవేశం పొందడానికి అంతగా ఆసక్తి చూపలేదు. గత రెండేళ్లలో వరుసగా 85, 92 మంది విద్యార్థులు ఎంయూలో ప్రవేశం పొందగా ఈ ఏడాది వారి సంఖ్య 5కు పరమితమైంది. కాగా..  విదేశీ, ఎన్నారై విద్యార్థులు ఎంయూలో అడ్మిషన్ పొందకపోవడానికి కరోనా నేపథ్యంలో ముంబైలో నెలకొన్న పరిస్థితులు కూడా ఓ కారణం అయ్యిండొచ్చని పలువురు అభిప్రాపడుతున్నారు. 


Updated Date - 2021-06-14T18:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising